E-Paper
Advertisement

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్

గంటకి 300 కిలోమీటర్ల వేగం… బుల్లెట్ ట్రెయిన్‌లో డెడ్లీ కిల్లర్స్ వేట… తెలుగులో స్ట్రీమింగ్
Advertisement

Bullet Train on OTT: ఒక హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌ లో ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తి వెనుక ఓ ప్రమాదకరమైన రహస్యం ఉంటే ? పైగా ఆ రైల్లో ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒక్కో ప్రయాణికుడి టార్గెట్‌ ఒక్కోలా ఉన్నా… చివరికి అందరి దారులు ఒకే చోట కలిస్తే ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘బుల్లెట్ ట్రైన్’ (Bullet Train). మరి ఈ మూవీని తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

బ్రాడ్ పిట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కథ మొత్తం టోక్యో నుంచి క్యోటోకు వెళ్లే బుల్లెట్ ట్రైన్‌ లోనే సాగుతుంది. లేడీబగ్ అనే ప్రొఫెషనల్ కిల్లర్‌ కు ఓ సింపుల్ మిషన్ అప్పగిస్తారు. రైల్లో ఉన్న డబ్బుల సూట్‌కేస్‌ ను తీసుకుని, తర్వాతి స్టేషన్‌లో దిగిపోవడమే అతడి పని. కానీ రైలు ఎక్కిన తర్వాత ఆ పని అంత ఈజీ కాదని అతడికి అర్థమవుతుంది. అదే రైల్లో లెమన్, టాన్జేరిన్ అనే ఇద్దరు కిల్లర్స్ ఓ అండర్‌వరల్డ్ డాన్ కొడుకును, అతడి దగ్గరున్న డబ్బుల సూట్‌కేస్‌ను కాపాడుతూ ఉంటారు.

Advertisement

మరోవైపు అమాయకంగా కనిపించే ప్రిన్స్ తన తెలివైన మైండ్ గేమ్స్‌ తో ప్రయాణికులను ఒక్కొక్కరినీ తన ఆటలోకి లాగుతుంది. తన కొడుకును బిల్డింగ్‌ పై నుంచి తోసేసిన వ్యక్తిపై పగ తీర్చుకోవడానికి కిమురా కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. మొదట వీళ్ల మిషన్లు వేర్వేరుగా కనిపిస్తాయి. కానీ ఒక్కొక్కరి గతం బయటపడుతున్న కొద్దీ, వీళ్లందరి కథలూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక వైట్ డెత్ అనే రష్యన్ మాఫియా డాన్ ఉంటాడు. తన భార్య మరణానికి కారణమైన వారందరినీ ఒకే రైల్లోకి రప్పించి అంతం చేయాలనేది అతడి ప్లాన్.

దీంతో డబ్బుల సూట్‌కేస్ కోసం మొదలైన చిన్న మిషన్ కాస్తా ప్రాణాంతకమైన గ్యాంగ్ వార్‌గా మారుతుంది. కత్తులు, తుపాకులు, బాంబులు, విషపూరితమైన పాము.. ఇలా ప్రతి దశలో కొత్త ప్రమాదం ఎదురవుతుంది. అయితే ఈ రక్తపాతం మధ్య వచ్చే కామెడీ, పాత్రల మధ్య జరిగే వాగ్వాదాలు సినిమాకు ప్రత్యేకమైన ఎంటర్‌టైనర్ టచ్ ఇస్తాయి. చివరికి బుల్లెట్ ట్రైన్ అదుపుతప్పి భారీ ప్రమాదానికి గురవుతుంది. ఈ గందరగోళం నుంచి లేడీబగ్ ఎలా బయటపడ్డాడు ? అసలు వైట్ డెత్ ప్లాన్ ఏమైంది ? మిగిలిన కిల్లర్స్ పరిస్థితి ఏంటి ? అనేదే క్లైమాక్స్‌లో ఆసక్తికరంగా ఉంటుంది.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘బుల్లెట్ ట్రైన్’ ప్రస్తుతం జియోహాట్‌స్టార్లో తెలుగు, హిందీ, తమిళ ఆడియోలతో అందుబాటులో ఉంది. బ్రాడ్ పిట్ యాక్షన్, వేగంగా సాగే కథనం, డార్క్ కామెడీ, ఊహించని ట్విస్టులు కలిసిన ఈ సినిమా… యాక్షన్ కామెడీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మంచి వన్‌టైమ్ ఎంటర్‌టైనర్. ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

Read Also: ప్రేమికులపై కన్నేసిన మాస్క్‌డ్ కిల్లర్… వీడి కంట్లో పడ్డారా డైరెక్ట్ నరకానికే… భయపెడుతూనే నవ్వించే రొమాంటిక్ స్లాషర్ ఫిల్మ్

Tags

Related News

రోజుకొకరితో బ్లైండ్ డేట్… ట్రయాంగిల్ లవ్ స్టోరీ… ప్రేమలో గెలవడానికి ప్రాక్టికల్ చిట్కాలున్న కొరియన్ సిరీస్ తెలుగులో

ఓటీటీలో మలయాళం సినిమాల హవా… ఈ 3 థ్రిల్లర్స్‌లో మీరెన్ని చూశారు?

హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 5 లిస్ట్… మొత్తం సిరీస్లదే హంగామా

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు

అవమానాల నుంచి అధిపత్యం వైపు… చరిత్ర సృష్టించిన ఓ రియల్ హీరో లైఫ్ స్టోరీ

ఊహకు అందని భవిష్యత్తు ప్రపంచం… విజ్ఞాన శాస్త్రం సృష్టించిన వింత వినాశనం

అపరిచితుల మధ్య రాత్రికి రాత్రే పుట్టే అందమైన ప్రేమ… మనసును హత్తుకునే మధురమైన లవ్ స్టోరీ

Big Stories

Advertisement
×