BigTV English

OTT Movie : స్టార్ హీరోయిన్ తో పాడు పనులకు ప్లాన్… సెన్సారోళ్లే నోరెళ్ళబెట్టిన సినిమా… ఇంకా చూడలేదా మావా?

OTT Movie : స్టార్ హీరోయిన్ తో పాడు పనులకు ప్లాన్… సెన్సారోళ్లే నోరెళ్ళబెట్టిన సినిమా… ఇంకా చూడలేదా మావా?

OTT Movie : కొరియన్ సినిమాలు, సిరీస్ లు ప్రపంచవ్యాప్తంగా అదరణపొందుతున్నాయి. వీటిని ఆదరించడంలో మనవాళ్ళు ఒక అడుగు ముందే ఉన్నారు. మలయాళం సినిమాల తరువాత కొరియన్ స్టోరీలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. స్టోరీలు కూడా మనసుకు హత్తుకునేలా ఉంటున్నాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే కొరియన్ సిరీస్ కామెడీ, రొమాంటిక్ సీన్స్ తో కేక పెట్టిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు చూపుకూడా తిప్పుకోలేరు. ఈ స్టోరీ 1980 నాటి కాలంలో జరుగుతుంది. ఒక హీరోయిన్ తీసుకునే సంచలన నిర్ణయం, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కునే సమస్యలు, వీళ్ళు చేసే పోరాటం ఈ సినిమా ఆసక్తికరంగా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళ్తే

1981లో సియోల్‌లోని కొరియన్ సినిమా పరిశ్రమ రూపు దిద్దుకుంటున్న సమయం. ఇక్కడ జంగ్ హీ-రాన్ ఒక ప్రముఖ నటి, సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ‘మేడమ్ ఎమా’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికవుతుంది. దీనిని గూ జంగ్-హో అనే ఒక వక్రబుద్ధి గల నిర్మాత నిర్మిస్తుంటాడు. అయితే ఈ సినిమాలో అసభ్యకరమైన సీన్స్ తీసేందుకు ఈ నిర్మాత ప్లాన్ చేస్తాడు. దీనికి ఆమె ఒప్పుకోక పోవడంతో, ఆమెను తనదారికి తెచ్చుకోలేక ఈ సినిమా నుంచి తొలగిస్తాడు. ఆమె స్థానంలో షిన్ జూ-ఏ అనే ఒక నైట్‌క్లబ్ డాన్సర్ ను ఈ పాత్ర కోసం ఎంచుకుంటాడు.


ఈ సినిమాని క్వాక్ ఇన్-వూ డైరెక్ట్ చేస్తుంటాడు. అతడు టాలెంట్ ఉన్న బలహీన స్వభావం గల డైరెక్టర్. ఈ వివాదాస్పద చిత్రాన్ని తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ సెన్సార్‌షిప్, చిత్ర పరిశ్రమ ఒత్తిళ్లతో సతమతమవుతాడు. హీ-రాన్, జూ-ఏ మొదట్లో పరస్పర విరోధంతో ఉన్నప్పటికీ, వీళ్ళు ఈ పరిశ్రమలో పురుషాధిక్య దోపిడీకి గురవుతున్నట్లు గుర్తిస్తారు. హీ-రాన్ అనుభవం, జూ-ఏ ఆత్మవిశ్వాసం వీళ్ళిద్దరినీ ఒకచోట చేరుస్తాయి. సెన్సార్‌షిప్, అధికార దుర్వినియోగంకి వ్యతిరేకంగా పోరాడేలా చేస్తాయి. ‘మేడమ్ ఎమా’ చిత్రం ఒక జాతీయ సంచలనంగా మారుతుంది. చివరికి ఈ పరిశ్రమలో వీళ్ళు ఎలాంటి మార్పులు తెస్తారు ? ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? ఇందులో హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ కొరియన్ సిరీస్ ని మిస్ కాకండా చుడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో 

‘ఎమా’ (Aema) ఒక కొరియన్ కామెడీ-డ్రామా మినీసిరీస్. లీ హే-యంగ్ దర్శకత్వంలో రూపొందింది. 2025 ఆగస్టు 22న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయింది. 6 ఎపిసోడ్‌లతో బింగ్-వాచ్‌కు అనువైన మినీసిరీస్‌గా అందుబాటులో ఉంది. IMDbలో 8/10 రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Read Also : భర్త ఉండగా డబ్బులిచ్చి మరీ మరొకడితో… ఇది మామూలు యవ్వారం కాదు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సిరీస్

Related News

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ఇంట్రెస్టింగ్ గా రెండు తెలుగు మూవీస్..

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

OTT Movie : లాటరీ డబ్బుతో అమ్మాయిలతో జల్సా… నరాలు జివ్వుమనే సీన్స్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie: భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

OTT Movie : కుప్పలు తెప్పలుగా మనుషుల శవాలు … థ్రిల్లింగ్ సీన్స్… బోన్ చిల్లింగ్ కన్నడ సై-ఫై థ్రిల్లర్

OTT Movie : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్

OTT Movie : దొంగతనానికి వెళ్లి ట్రాప్ లో… ముసలాడా మజాకా… అదిరిపోయే మలయాళ కామెడీ థ్రిల్లర్

Big Stories

×