Punjab Rains: యూట్యూబర్లు వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కొన్నిసార్లు కొంత మంది ప్రాణాలు కోల్పోయినా మిగతా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. రీసెంట్ ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో నిలబడి రీల్స్ చేస్తూ సాగర్ అనే యూట్యూబర్ వరదల ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చండీగఢ్ లోనూ కొంత మంది ఇలాగే ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. అదృష్టం బాగుండి చావు నుంచి తప్పించుకున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా చండీగఢ్ సమీపంలోని జయంతి మజ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగుతూ ప్రవహించాయి. మల్లన్ పూర్ నుంచి జయంతి మజ్రి వరకు ప్రవహించే నది ఆదివారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పొంగి ప్రవహించడం ప్రారంభించింది. సాయంత్రం, నది ఒడ్డున నిలబడి ఉన్న ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి వేచి ఉన్నారు. ఇంతలో ఒక కారు డ్రైవర్ నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. నదిని దాటకుండా ప్రజలు అతడిని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అతను ఎవరి మాట వినలేదు. జీపును నదీ ప్రవాహంలో నుంచి ముందుకు తీసుకెళ్లాడు. బలమైన వరద ప్రవాహంలో జీపు కొట్టుకుపోయింది. పల్టీలు కొడుతూ వెళ్లిపోయింది.
https://www.instagram.com/aaruksh/reel/DNvhTHMUn2B/
Read Also: లోకల్ ట్రైన్ లో ప్రేమ జంట ముద్దులాట.. అందరి ముందు ఏంటా పని?
వెంటనే స్పందించి, ప్రాణాలు కాపాడిన స్థానికులు
జీప్ వరదలో కొట్టుకుపోవడంతో వెంటనే స్థానికులు రియాక్ట్ అయ్యారు. కొంత మంది వ్యక్తులు కొట్టుకుపోతున్న జీపును పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే జేసీబీని పిలిపించి జీపును బయటకు తీశారు. దానిలోని ఇద్దరు యువకులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. జీపు మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. అయితే, ఇదంతా సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే చేసిన పనిగా కొంత మంది భావిస్తున్నారు. సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని అలాగే వదిలేస్తే మరికొంత మంది వారిలాగే ప్రవర్తించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు జీపులోని వ్యక్తులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!