OTT Movie : బో*ల్డ్ థీమ్‌తో రూపొందిన ఒక హిందీ సిరీస్ ఆసక్తికరమైన కథనంతో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న భర్త ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. మరొక మహిళతో భర్త కూడా సంబంధం పెట్టుకుంటాడు. ఇది ఒక నెట్ వర్క్ లా నడుస్తుంటుంది. ఒక్క ఎపిసోడ్ మొదలు పెడితే ఇక చివరి వరకు చూపు తిప్పుకోకుండా ఈ సిరీస్ ని చూస్తారు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
ఈ సిరీస్ ఆదర్శ్ అనే వ్యక్తితో ప్రారంభమవుతుంది. అతను ఒక చిన్న పట్టణంలో స్థానిక వార్తాపత్రిక ఎడిటర్‌గా పనిచేస్తుంటాడు. అతని జీవితం ఒక రొటీన్‌లో నడుస్తుంటుంది. ప్రేమ లేని పెళ్ళి, ఆర్థిక ఒత్తిళ్లతో ఆదర్శ్ బాధపడుతుంటాడు. ఆదర్శ్ తన పనికి పూర్తిగా సమయం కేటాయిస్తాడు. కానీ అతని భార్య నైనాని గమనించలేక పోతాడు. ఒక రోజు ఆదర్శ్‌కు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. నైనా, సన్నీ అనే యువకుడితో సంబంధం కలిగి ఉంటుంది. అతనికి డబ్బులచ్చి మరీ ఆపని చేయించుకుంటుంది. ఈ షాకింగ్ ట్విస్టుకి ఆదర్శ్ బ్రైన్ గిర్రున తిరుగుతుంది.
ఈ విశ్వాసఘాతం ఆదర్శ్ ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఈ ఘటన ఆదర్శ్‌లో కోపం, అవమానం పెంచుతుంది. అతను నైనాను నీచంగా తిడతాడు. సన్నీతో గొడవకు దిగుతాడు. అయితే ఇతను ప్రతీకారంకి బదులు, ఒక వింతైన నిర్ణయం తీసుకుంటాడు. అతను సన్నీ లాంటి వ్యక్తిగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ నిర్ణయం పోయిన అతని గౌరవం తిరిగి పొందడానికి ఒక మార్గంగా ఉంటుందని అనుకుంటాడు. ఆదర్శ్, సన్నీ సహాయంతో సితారా అనే మహిళ నడిపే ఒక సీక్రెట్ సర్వీస్‌లో చేరతాడు. ఆమె ఒక బోటిక్ వెనుక ఈ వ్యాపారాన్ని నడుపుతుంటుంది.
మొదటి కొన్ని ఎపిసోడ్‌లలో, ఆదర్శ్ ఈ కొత్త ప్రపంచంలో తడబడుతూ కనిపిస్తాడు. అతనికి ఇలాంటి విషయాలలో అనుభవం లేకపోవడం వల్ల, ఈ సీన్స్ కామెడీ సన్నివేశాలకు దారితీస్తుంది. అదే సమయంలో నైనా ఆదర్శ్ నుంచి విడి పోయి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుంది. తాను చేసిన పనిపై ఆలోచనలో పడుతుంది. ఇక సన్నీ ఆదర్శ్‌కు ఒక విచిత్రమైన స్నేహితుడిగా మారతాడు. ఇక ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? నైనా ఎలాంటి జీవితానికి అలవాటుపడుతుంది ? ఆదర్శ్ మళ్ళీ భార్యతో కలసి జీవిస్తాడా ? వేరే మహిళలతో సంబంధం పెట్టుకుంటాడా ? అనే విషయాలను తెలుసు కోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘Rangeen’ కోపల్ నైథానీ, ప్రాంజల్ దువా దర్శకత్వంలో రూపొందిన హిందీ డార్క్ కామెడీ వెబ్ సిరీస్. ఇది 2025 జూలై 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. కబీర్ ఖాన్, రాజన్ కపూర్ నిర్మించిన ఈ 9-ఎపిసోడ్ సిరీస్‌లో వినీత్ కుమార్ సింగ్ (ఆదర్శ్), రాజశ్రీ దేశ్‌పాండే (నైనా), తారుక్ రైనా (సన్నీ), షీబా చద్దా (సితారా), మేఘనా మాలిక్ (రేణు) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సినిమా 7.5/10 రేటింగ్ ను పొందింది.
Read Also : అందరి ముందే ఆ పని… మనవరాలికి యాంగిల్స్ గురించి నూరి పోసే బామ్మ… ఈ బ్లాక్ కామెడీ ప్యూర్ గా పెద్దలకు మాత్రమే