Kichcha Sudeep : కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు సుదీప్ కిచ్చా(Sudeep Kichcha)కు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉందని చెప్పాలి. కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన తెలుగులో ఈగ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నాని సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో సుదీప్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా కన్నడలో ఈయన నటించిన సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
బిగ్ బాస్ హోస్ట్ గా సుదీప్…
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు కన్నడ బిగ్ బాస్(Kannada Bigg Boss) కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈ హీరో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సుదీప్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు అయితే త్వరలోనే తన పుట్టినరోజు(Birthday) రాబోతున్న నేపథ్యంలో అభిమానులకు కీలకమైన సందేశాన్ని తెలియజేస్తూ ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది. సాధారణంగా హీరోల పుట్టినరోజు అంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ రెండో తేదీ సుదీప్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోబోతున్నారు.
ముందు రోజే మిమ్మల్ని కలుస్తా…
ఇలా తన పుట్టినరోజు త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ఈయన అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ..”సెప్టెంబర్ రెండవ తేదీ నా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఎవరు నా ఇంటి ముందుకు రావద్దు. సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం కాదు రాత్రి కలుద్దాం. ఆరోజున మీరు నన్ను కలవడానికి ఎంతలా ఎదురు చూస్తూ ఉంటారో నేను కూడా మీకోసం అంతే ఎదురు చూస్తూ ఉంటాను. అందుకే ప్రతి ఏడాది మీతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను కానీ ఈసారి మాత్రం అలా జరుపుకోవడానికి కుదరదని ఈయన తెలిపారు.
To all my dearest Frnzzz,,,
Saw many videos posted about
the excitement shown to celebrate 2nd Sept.
Big big thanks for this unconditional luv.
Mch luv and Hugs
❤️🤗 pic.twitter.com/Q3fP0otsxQ— Kichcha Sudeepa (@KicchaSudeep) August 25, 2025
మొదటిసారి నా తల్లి లేకుండా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాను. ఇది కాస్త కష్టతరంగా ఉంది. అందుకే రెండో తేదీ ఉదయం కాకుండా రాత్రి నా ఇంటి ముందు మీ సెలబ్రేషన్స్ కాకుండా కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే వినాలని కోరుకుంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని ఇంటి ముందు ఎవరు గోల చేయొద్దు అంటూ ఈ సందర్భంగా అభిమానులను వేడుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఎక్కడ కలవాలి అనే విషయాన్ని మీకు చెబుతాను. అక్కడే మిమ్మల్ని కలుస్తాను ఇక రెండో తేదీ ఎవరూ కూడా నా ఇంటి ముందుకు రావద్దని సుదీప్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇలా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఈయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక సుదీప్ సినిమాల విషయానికి వస్తే..అనూప్ బండారి దర్శకత్వంలో బిల్లా రంగా భాషా(Billa Ranga Basha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)హీరోయిన్ గా నటించబోతున్నారు.
Also Read: Sachin Tendulkar: సౌత్ సినిమాపై మనసు పడ్డ క్రికెట్ దిగ్గజం… అంతగా నచ్చిన సినిమా ఏంటబ్బా?