BigTV English

OTT Movie : మర్డర్ కేసులో మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్… ఓటిటిలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మర్డర్ కేసులో మెంటలెక్కించే ఇన్వెస్టిగేషన్… ఓటిటిలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులో క్రైమ్ మిస్టరీ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ వేరు. ఈ మధ్య ఇటువంటి సినిమాలను మన ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారి కోసమే ఒక క్రేజీ మూవీ సజెషన్. ఈ మూవీ కథ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


కథలోకి వెళ్తే…

ఈ సినిమా స్టోరీ 1997 బ్యాక్ డ్రాప్ లో,  కర్ణాటకలోని మలనాడు అనే ప్రాంతంలో ఉన్న నల్కేరి అనే మారుమూల గ్రామంలో నడుస్తుంది. ఆ ఊర్లో ఇన్స్పెక్టర్ గోవిందు పోలీస్ అధికారి అయినప్పటికీ రైతులా సైలెంట్ గా జీవితాన్ని గడుపుతాడు. ఎందుకంటే గత 26 ఏళ్ల నుంచి ఈ పోలీస్ స్టేషన్లో ఒక్క క్రైమ్ కూడా ఫైల్ కాదు. అంటే ఆ ఊరు అంతా పీస్ ఫుల్ గా ఉంటుందన్నమాట. అయితే స్థానిక భూస్వామి శ్రీనివాసయ్య సడన్ గా  చనిపోవడంతో ఊరు ఊరంతా షాక్ అవుతుంది. అసలు క్రైమ్ అనేదే లేని ఆ ఊర్లో ఆయనను ఎవరో హత్య చేశారని గోవిందు ప్రకటించడం గ్రామస్తులకు ఊహించని షాక్ గా మారుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా గోవిందు దర్యాప్తు మొదలుపెడతాడు. ఈ కేసుకు 1970 లో పరిష్కరించలేకపోయిన మరో కేసుకు లింక్ ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఆ గ్రామంలో మొదటి కంప్యూటర్ ని పరిచయం చేసిన అబ్బాయి రోహిత్, పంకజ, శ్రీనివాసయ్య కొడుకు సంబంధం ఉన్న మరో అమ్మాయి ఇన్వెస్టిగేషన్లో కీలకంగా మారతారు. అసలు వీళ్లకు ఆ మర్డర్ తో సంబంధం ఏంటి? శ్రీనివాసయ్యను ఎవరు చంపారు? చివరికి స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? అనే విషయాలు తెలియాలంటే, ఈ  క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘అజ్ఞాతవాసి’ (Agnyathavaasi) . ఈ కన్నడ క్రైమ్ డ్రామాకు జనార్ధన చిక్కన్న దర్శకత్వం వహించారు. హేమంత్ ఎం రావు, ప్రచుర పిపి, జయలక్ష్మి సంయుతంగా నిర్మించిన ఈ మూవీ దాక్షాయిని టాకీస్ బ్యానర్లో రూపొందింది. ఇందులో రంగాయణ రఘు, పావన గౌడ, సిద్దు మూలిమణి, రవిశంకర్ గౌడ్ నటించారు. ఈ మూవీ (Zee 5) ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మూవీ స్లో గా కదులుతూ, ఊహించని మలుపులు తీసుకుంటుంది.

Read Also : పక్కింట్లో మర్డర్, ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×