BigTV English

Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్పతి షోకు అమితాబ్ బచ్చన్ గుడ్ బై… కొత్త హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో

Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్పతి షోకు అమితాబ్ బచ్చన్ గుడ్ బై… కొత్త హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో

భారత టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్విజ్ షో ఏదైనా ఉందంటే అది కౌన్ బనేగా కరోడ్పతి(KBC). ఈ షో 2000 లో ప్రారంభమైంది. అప్పటినుండి అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి రెండు సీజన్లకు అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత మూడో సీజన్ 2007లో ఆయన అనారోగ్య కారణంగా కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. అప్పుడు షారుఖాన్ హోస్ట్ చేశారు. తరువాత వచ్చిన నాలుగో సీజన్ నుండి 16 సీజన్ల వరకు అమితాబచ్చన్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. KBC అంటే అమితాబచ్చన్ ..అమితాబచ్చన్ అంటే KBC అన్నంతగా ప్రేక్షకుల్లో నిలిచిపోయారు . తాజాగా సీజన్ 17 లో ఆయన స్థానంలో మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ను హోస్ట్ గా తీసుకోనున్నట్లు సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..


కౌన్ బనేగా కరోడ్పతి షోకు అమితాబ్ బచ్చన్ గుడ్ బై…

బ్రిటన్ లో ఎంతో ఆదరణ పొందిన హూ వాంట్స్ టు బీ ఏ మిలియనీర్ షో స్ఫూర్తిగా, కౌన్ బనేగా కరోడ్‌పతి ని ప్రారంభించారు. పాతికేళ్ల క్రితం 2000లో తొలిసారి కేబీసీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమితాబచ్చన్ యాంకర్ గా సాగిన ఈ షో ఫస్ట్ సీజన్ లో 315 ఎపిసోడ్లతో సంచలనం సృష్టించారు. అలా ప్రారంభించిన మొదటి సీజన్ ఎంతో సక్సెస్ కావడంతో కేబీసీ కు అమితాబచ్చన్ పర్మినెంట్ యాంకర్ గా ప్రజల్లో నాటుకుపోయారు. అయితే రెండో సీజన్ జరుగుతుండగా అమితాబచ్చన్ కు అనారోగ్యం గురయ్యారు. ఆ సీజన్ అక్కడితో ఆపేశారు. తర్వాత మూడో సీజన్ ను కొంతకాలం తర్వాత స్టార్ట్ చేసి, షారుక్ ఖాన్ తో 53 ఎపిసోడ్లు రన్ చేశారు. కానీ బిగ్ బి కి వచ్చినంత క్రేజ్ షారుఖ్ కు రాలేదు. దాంతో ఆ సీజన్ అక్కడితో ఆపేశారు. ఇక నాలుగవ సీజన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత 2010లో ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో, నాలుగో సీజన్ ప్రారంభించారు. ఇక అప్పటినుండి వరుసగా 13 సీజన్లలో అమితాబచ్చన్ హోస్టుగా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 16 సీజన్లలో ఒక్క సీజన్ మినహాయించి, మిగిలిన అన్ని సీజన్లో అంటే దాదాపు 15 సీజన్స్ లో అమితాబ్ తన యాంకరింగ్ తో అభిమానులని మెస్మరైజ్ చేశారు. ఇంత చరిత్ర కలిగిన కేబీసీ లో అమితా బచ్చన్ లేకుండా 17వ సీజన్ రానున్నట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా జూన్ లో మొదలయ్యే 17వ సీజన్లో అమితాబచ్చన్ ప్లేస్ లో సల్మాన్ ఖాన్ ను హోస్ట్ గా తీసుకోనున్నట్లు సమాచారం. కేబీసీ ఫ్యాన్స్ కు ఈ వార్త షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. అమితాబచ్చన్ లేకుండా కేబీసీని ఊహించుకోగలమా అని ఫ్యాన్స్ అంటున్నారు.


కొత్త హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో..

ఇక సల్మాన్ ఖాన్ హిందీలో బిగ్ బాస్ షో లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా బిగ్ బాస్ షో 18 సీజన్లో సల్మాన్ ఖాన్ 4 సిరీస్ తప్ప అన్నింటికీ హోస్టుగా వ్యవహరించారు. బిగ్ బాస్ మూడో సీజన్ లో అమితాబచ్చన్ మోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  బిగ్ బాస్ షో సల్మాన్ ఖాన్ మాత్రమే చేయగలడు అనేలా ఆ షోలో ఆయన పాతుకుపోయారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరోను ఇప్పుడు కేబీసీ లో 17వ సీజన్ కు హోస్ట్ గా ఎంచుకుంటున్నారని టాక్.

కొత్త సీజన్ కు ఎవరు హోస్టుగా..రానున్నారో..

సోనీ టీవీ ఏప్రిల్ 4 KBC సీజన్ 17 కోసం అమితాబచ్చన్ తో ఓ ప్రమోషనల్ వీడియోని విడుదల చేసింది. ఇందులో ఆయన షో రిటర్న్ సూచిస్తూ సోనీ లైవ్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రోమో వీడియో చుసిన ఫాన్స్ అమితాబచ్చన్ హోస్టుగా కంటిన్యూ అవుతారని అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా సల్మాన్ ఖాన్ ను హోస్ట్ గా తీసుకుంటున్నట్లు, అమితాబచ్చన్ వయసు 82 సంవత్సరాల ఈ వయసులో బిగ్ బి ను, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆగస్టులో ప్రారంభం కానున్న కేబీసీకి సల్మాన్ ఖాన్ ని సంప్రదిస్తున్నట్లు బాలీవుడ్ లోటాక్. అయితే సీజన్ ఆగస్టు 17న ప్రారంభం కానుంది. జులైలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అమితాబచ్చన్ ఈ సీజన్ లో కొనసాగుతారా, లేదంటే సల్మాన్ ఖాన్ కొత్త హోస్ట్ గా షో కి తీసుకు వస్తారా అనే దానిపై సోనీ టీవీ నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×