BigTV English

OTT Movie : పక్కింట్లో మర్డర్, ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : పక్కింట్లో మర్డర్, ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్… మెంటల్ గా వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల స్టోరీలతో తెరకెక్కిన సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సస్పెన్స్ తో మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం అన్నా అనే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆమె చూసిన ఒక మర్డర్ కేసు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

అన్నా ఫాక్స్ (ఎమీ ఆడమ్స్) ఒక చైల్డ్ సైకాలజిస్ట్ గా పని చేస్తుంది. న్యూయార్క్ నగరంలో ఉన్న ఒక పెద్ద ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తుంది. ఈ అమ్మాయి అగోరఫోబియాతో బాధపడుతూ, ఇంటి నుండి బయటకు రాలేకపోతుంది. ఆమె భర్త ఎడ్వర్డ్, కుమార్తె ఒలివియాతో విడిపోయి ఉంటుంది. కానీ వాళ్ళతో రోజూ ఫోన్ ‌లో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాదు అన్నా మద్యం సేవిస్తూ, పాత సినిమాలు చూస్తూ, ఆన్‌లైన్ చెస్ ఆడుతూ ఉంటుంది. అక్కడితో ఆగకుండా ఓ బ్యాడ్ హ్యాబిట్ ను అలవాటు చేసుకుంటుంది.


ఇంట్లో ఉంటూనే పక్కింటి వాళ్ళపై ఓ కన్నేసి ఉంచుతుంది. స్పెషల్ గా తన ఇంట్లో కిటికీ నుంచి పొరుగింటి వాళ్ళను చూస్తూ ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా ఆమె ఎదురుగా ఉన్న జేన్ రస్సెల్ కుటుంబంపై శ్రద్ధ పెడుతుంది. ఒక రోజు అన్నా రస్సెల్ పక్కింట్లో జేన్ రస్సెల్ హత్యకు గురవుతున్నట్లు కిటికీ నుండి చూస్తుంది. ఈ విషయం ఆమె వెంటనే పోలీసులకు తెలియజేస్తుంది. అయితే ఆమె మాటలను పోలీసులు నమ్మరు. ఎందుకంటే రస్సెల్ కుటుంబం అంతా బతికే ఉన్నట్లు చెబుతారు. అంతేకాక ఆమెకు జేన్‌గా మరొక మహిళ కనిపిస్తుంది. ఆమెను చూసి అన్నా గందరగోళంలో పడుతుంది. చివరికి అన్నా చూసిన హత్య నిజంగా జరిగిందా ? లేకపోతే అది ఆమెకున్న మానసిక రోగమా ? కొత్తగా వచ్చిన జేన్ ఎవరు ? ఈ విషయాలను తెలుసుకోవాలంటే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

OTT Movie : అబ్బాయిలపై పగతో రగిలిపోయే అక్కా చెల్లెళ్ళు… థ్రిల్లింగ్ ట్విస్టులతో మెంటలెక్కించే సైకో థ్రిల్లర్ మూవీ

 

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది వుమన్ ఇన్ ది విండో’ (The women in the Window). 2021 లో వచ్చిన ఈ సినిమా A.J. ఫిన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఎమీ ఆడమ్స్ ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×