E-Paper
Advertisement

Amazon Prime February Release: ‘ది బ్లఫ్’ నుంచి ‘ఇక్కిస్’ వరకు… ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియో క్రేజీ లైనప్

Amazon Prime February Release: ‘ది బ్లఫ్’ నుంచి ‘ఇక్కిస్’ వరకు… ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియో క్రేజీ లైనప్
Advertisement

Amazon Prime February Release : 2026 కొత్త ఏడాది స్టార్ట్ కావడమే కాదు, అప్పుడే జనవరి చివరి వారం వచ్చేసింది. మరో రెండ్రోజుల్లో ఫిబ్రవరి ప్రారంభం కానుంది. అంతలోపే వచ్చే నెల ఏ ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ కాబోతోంది అనే ఆదుర్దా పెరిగిపోయింది. ఎందుకంటే మూవీ లవర్స్ సినిమా థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి ఇంట్లోనే హాయిగా సినిమాలు చూడవచ్చు అన్నది ఆడియన్స్ ఆలోచన. అయితే జనవరి ముగియడంతో, ఫిబ్రవరిలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక సినిమాలు, సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ఓటీటీ దిగ్గజాలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరిలో ఏ తేదీల్లో ఏ సినిమాలు విడుదలవుతాయో తెలుసుకుందాం పదండి.

దల్దల్ – Daldal series

భూమి పెడ్నేకర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “దల్దల్”. జనవరి 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో భూమి పోలీసు అధికారిణిగా నటించింది. సిరీస్ లో ఆమె ఒకే తరహాలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ కోసం వెతుకుతుంది. ఇందులో జయ భట్టాచార్య, సమర తిజోరి, రాహుల్ భట్ కూడా నటించారు.

ది రెకింగ్ క్రూ

Advertisement

ఇద్దరు సవతి సోదరులు తమ తండ్రి మరణం తర్వాత షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటారు. తండ్రీ మరణంలో దాగున్న మర్మం ఏంటి? దాన్ని ఎలా కనుగొంటారనే కథే ‘ది రెకింగ్ క్రూ’. ఈ చిత్రం జనవరి 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయ్యింది.

క్రాస్ సీజన్ 2

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘క్రాస్ సీజన్ 2’. మొదటి సీజన్ 2024లో స్ట్రీమింగ్ అయింది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు సీజన్ 2 ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, సీరియల్ కిల్లర్ సిరీస్‌లను ఆస్వాదిస్తే, ఖచ్చితంగా ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

ది బ్లఫ్ – The Bluff Movie

Advertisement

ప్రియాంక చోప్రా అప్ కమింగ్ యాక్షన్ మూవీ “ది బ్లఫ్”. ఇది ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా యాక్షన్‌ మోడ్ లో, పవర్‌ఫుల్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పిక్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి.

56 డేస్

రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ’56 డేస్’. ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్ కేథరీన్ ర్యాన్ హోవార్డ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కించారు.

తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటించిన మూవీ ‘తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ’. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇంకా చూడకపోతే ఓటీటీలో ఒక లుక్కేయండి.

ది సిఇఓ క్లబ్ – The Ceo Club Series

అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ ‘ది సిఇఓ క్లబ్’. మహిళా సిఇఓలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించే కథ ఇది. డాక్యుమెంటరీ తరహాలో ఉండే ఈ సిరీస్ ప్రతి మహిళకు కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 23న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

ఇక్కీస్ – Ikkis Movie

అగస్త్య నంద నటించిన మూవీ ‘ఇక్కీస్’. డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. “దురంధర్” విజయం ముందు ఈ మూవీ కొట్టుకుపోయింది. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

Read Also : మీనా థ్రిల్లర్ సిరీస్ పై హాట్ స్టార్ అఫిషియల్ అనౌన్స్మెంట్… లైన్లో ఇంకా 4 వెయిటింగ్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×