E-Paper
Advertisement

Hollywood OTT Releases : ‘ది ష్రింకింగ్ సీజన్ 3’ నుండి ‘వండర్ మ్యాన్’ వరకు… ఓటీటీలోకి అడుగు పెట్టిన న్యూ హాలీవుడ్ సిరీసులు ఇవే

Hollywood OTT Releases : ‘ది ష్రింకింగ్ సీజన్ 3’ నుండి ‘వండర్ మ్యాన్’ వరకు… ఓటీటీలోకి అడుగు పెట్టిన న్యూ హాలీవుడ్ సిరీసులు ఇవే
Advertisement

Hollywood OTT Releases : వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలలో సినిమాల జాతర జరుగుతుంది. ఆడియన్స్ హాయిగా ఇంట్లోనే కూర్చుని కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లను చూడవచ్చు. అయితే ఇలా విడుదలయ్యే సినిమాలలో కూడా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఉండడం విశేషం. కాబట్టి హాలీవుడ్ సిరీస్ లు, సినిమాల లవర్స్ కు వీకెండ్ వచ్చిందంటే పండగే. మీరు కూడా ఆ లిస్ట్ లో ఉంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. వరుసగా 3 రోజుల్లోనే 3 సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. కామెడీ, డ్రామా, రొమాన్స్‌ వంటి జానర్లలో తాజాగా ఓటీటీలో సందడి చేస్తున్న ఆ ఇంగ్షీషు సిరీస్ లు ఏంటో చూసేద్దాం పదండి.

ష్రింకింగ్ సీజన్ 3 (Shrinking Season 3)

కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ ‘ష్రింకింగ్ సీజన్ 3’. మొదటి రెండు సీజన్లు ప్రేక్షకులను సక్సెస్ ఫుల్ గా నవ్వించాయి. ఇప్పుడు ఈ సిరీస్ మూడవ సీజన్‌ తో తిరిగి ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధం అయ్యింది. మేకర్స్ ప్రకారం ఇదే చివరి సీజన్ కావచ్చు. కాబట్టి ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సీజన్‌ 3లో జాసన్ సెగెల్, జెస్సికా విలియమ్స్, ల్యూక్ టెన్నీ, మైఖేల్ యురీ, లుకిటా మాక్స్‌వెల్, క్రిస్టా మిల్లర్, హారిసన్ ఫోర్డ్, టెడ్ మెక్‌గిన్లీ నటించారు. ‘ష్రింకింగ్ సీజన్ 3’ జనవరి 28 నుంచి ప్రీమియర్ అవుతుంది. ఆపిల్ టీవీలో ఈ సిరీస్ ను చూడవచ్చు.

బ్రిడ్జర్టన్ సీజన్ 4 (Bridgerton Season 4)

Advertisement

వేరే ప్రపంచంలో, గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సాగే రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’. ఈసారి కథ బెనెడిక్ట్ బ్రిడ్జర్టన్ అనే బ్రహ్మచారి చుట్టూ తిరుగుతుంది. ఒక విలాసవంతమైన పార్టీలో అతను నిజానికి మారువేషంలో ఉన్న ఒక స్త్రీని కలుస్తాడు. ఇక్కడే వారి మధ్య రొమాంటిక్ స్టోరీ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో మసాలి బదుజా, యెరిన్ హా, కేటీ లియుంగ్, మిచెల్ మావో, ఎమ్మా నవోమి, హ్యూ సాచ్స్, ఇసాబెల్లా వీ నటించారు. ‘బ్రిడ్జర్టన్ సీజన్ 4’ రెండు భాగాలుగా విడుదల అవుతుంది. మొదటి భాగం జనవరి 29న, రెండవ భాగం ఫిబ్రవరి 26న ప్రీమియర్ అవుతుంది. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

వండర్ మ్యాన్ (Wonder Man)

కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ ‘వండర్ మ్యాన్’ ఇద్దరు హాలీవుడ్ నటుల చుట్టూ తిరుగుతుంది. తమ కెరీర్‌లను ముందుకు తీసుకెళ్లడానికి జీవితాన్ని మార్చే చిత్రాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సూపర్ హీరో పాత్రను పోషించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పడ్డ కష్టాలు ఉత్కంఠను పెంచేస్తాయి. ఇందులో ప్రేక్షకులు వినోద పరిశ్రమలోని గ్లామర్ వెనుక ఉన్న దారుణమైన నిజాలను చూడవచ్చు. ఈ సిరీస్‌లో యాహ్యా అబ్దుల్-మతీన్ II, బెన్ కింగ్స్లీ, ఆర్యన్ మోయెద్, ఎక్స్ మాయో, జ్లాట్కో బురిక్ నటించారు. ‘వండర్ మ్యాన్‌’కు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్, జేమ్స్ పోన్సోల్డ్ట్, టిఫనీ జాన్సన్, స్టెల్లా మెక్‌గీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జనవరి 27 నుంచి జియో హాట్ స్టార్ లో ప్రసారం ప్రారంభమైంది.

Advertisement

Read Also : రిలీజైన 14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన ‘వా వాతియార్’… కార్తీ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×