BigTV English

OTT Movie : అమ్నీసియాతో గతాన్ని మర్చిపోయే అమ్మాయి… ఆమెను చంపడానికి కాచుక్కూర్చునే కిల్లర్లు… క్రేజీ క్రైమ్ సిరీస్

OTT Movie :  అమ్నీసియాతో గతాన్ని మర్చిపోయే అమ్మాయి… ఆమెను చంపడానికి కాచుక్కూర్చునే కిల్లర్లు… క్రేజీ క్రైమ్ సిరీస్

OTT Movie : సన్నీ లియోన్ పేరు వింటే చాలు కుర్రకారుకే కాదు, పండు ముసలి వాళ్ళుకు సైతం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఇక కొండలను సైతం పిండి చేసేస్తామంటారు. ఈ భామ రొమాంటిక్ సినిమాలనే కాదు, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో కూడా నటించింది. దర్శకుడు విక్రమ్ భట్ ఒక వెబ్ సిరీస్ తో కొత్త ప్రయోగం చేసాడు. మరి ఈ అమ్మడు తన అందచందాలతో ఈ యాక్షన్ సీన్స్ ను ఎలా పేల్చిందో ఒక సారి చూసేద్దాం పదండి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

అనామిక (సన్నీ లియోన్) ఒక మాజీ గూఢచారి. మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రమాదంలో తన గతాన్ని మరచిపోతుంది. రెట్రోగ్రేడ్ అమ్నీషియాతో బాధపడుతుంటుంది. ఆమెను రక్షించిన డాక్టర్ ప్రశాంత్, ఆమె గతం గురించి కొంత తెలుసుకున్న ఏకైక వ్యక్తి. అనామిక ప్రశాంత్‌తో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమె శత్రువులు ఆమెను ఇప్పుడు వెంబడిస్తారు. రియా అనే ఒక టాప్ ఫీల్డ్ ఏజెంట్, అనామిక పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అనామిక తన గూఢచారి శిక్షణ, పోరాట నైపుణ్యాలతో శత్రువులను ఎదుర్కొంటుంది. ఆమె తన గతాన్ని తిరిగి తెలుసుకొనేందుకు డ్రగ్ లార్డ్ సమీర్ ఒబెరాయ్, అతని హెంచ్‌మెన్ వాలియా లను వెంబడిస్తుంది. ఈ క్రమంలో రోహన్ అనే ఒక పాత స్నేహితుడు ఆమెకు సహాయం చేస్తాడు.


ఈ యాక్షన్-ప్యాక్డ్ ప్రయాణంలో ఆమె గతంలోని రహస్యాలు, కుట్రలు ఆమెకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తాయి. అనామిక, వాలియా ద్వారా ఒబెరాయ్‌ను గూఢచర్యం చేస్తూ, ఒక మిస్టరీ పెయింటింగ్‌లో దాగిన కోడ్‌ను కనుగొంటుంది. ఇది ఆమె గతం గురించి మరిన్ని నిజాలను తెలుసుకునేలా చేస్తుంది. అయితే ఆమె శత్రువులు ఒక కుట్రతో ఆమెను బంధిస్తారు. ఇక స్టోరీ ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది. అనామిక శత్రువుల నుంచి ప్రాణాలతో బయట పడుతుందా ? పెయింటింగ్‌లో దాగిన కోడ్‌ ఏమిటి ? ఆమె గతం ఎలాంటిది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘Anamika’ 2022లో విడుదలైన బాలీవుడ్ యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. విక్రమ్ భట్ దర్శకత్వంలో సన్నీ లియోన్ (అనామిక ), సోనాలీ సేగల్ (రియా), రాహుల్ దేవ్ (రవి శ్రీవాస్తవ్), సమీర్ సోని (సమీర్ ఒబెరాయ్), అయాజ్ ఖాన్ (డాక్టర్ ప్రశాంత్), షెహజాద్ షేక్ (రోహన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ సన్నీ లియోన్ ను యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఆమెను ఒక కొత్త అవతార్‌లో చూపిస్తుంది. ఈ సిరీస్ 2022 మార్చి 10న MX ప్లేయర్‌లో విడుదలై, 8 ఎపిసోడ్‌లతో హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది.

Read Also :రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

Related News

OTT Movie : అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ పని చేసే టీనేజర్… పని కానిస్తూ పరలోకానికి క్లయింట్… ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూడాల్సిన మూవీ

OTT Movie : ప్రియుడి కొడుకుతోనే యవ్వారం… వృద్ధాప్యం దరిచేరని అమ్మాయి అరాచకం… సింగిల్ గా చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : పిల్లలు పుట్టరని తెలిసి దూరం పెట్టే ప్రియుడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు బుర్రపాడు… ఇక జన్మలో అమ్మాయిల జోలికి వెళ్ళడు

OTT Movie : ఓడలో భీకర మారణకాండ… పోలీసులను బురిడీ కొట్టించే కేటుగాడు… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : వాలెంటైన్స్ డే రోజు వరుస హత్యలు… సింగిల్ గా ఉంటే ఈ సైకో చేతిలో చావే… గుండె గుభేల్మన్పించే కిల్లర్ మూవీ

Big Stories

×