Brahmamudi serial today Episode: గణపతి పూజ గురించి రాష్‌గా మాట్లాడిన రుద్రాణికి కావ్య వివరంగా చెప్తుంది. దీంతో ఇంట్లో అందరూ నవ్వుకుంటారు. ఇంతలో కనకం, మూర్తి వస్తారు. వచ్చిన వాళ్లు గడప దగ్గరే నిలబడిపోతారు. దీంతో ఇంద్రాదేవి వాళ్లను చూసి లోపలికి పిలుస్తుంది. వాళ్లిద్దరూ లోపలికి రాగానే.. ఏంటి ఎప్పుడూ లేనిది అన్నయ్య గారిని తీసుకుని వచ్చావు ఏంటి విశేషం అని అపర్ణ అడుగుతుంది. వినాయక చవితి వస్తుంది కదా..? నా ముగ్గురు కూతుళ్లను ఇంటికి తీసుకెళ్లి మేము వినాయక పండుగ చేసుకుందామని వచ్చాను అని కనకం చెప్పగానే.. అదేంటి కనకం నీ కూతుర్లను తీసుకెళ్లడానికి ఇంత మొహమాటం పడాలా…? అంటుంది ఇంద్రాదేవి.. ఇంతలో అపర్ణ అదేంటి అత్తయ్యా ఇందాక మామయ్యగారు చెప్పారు కదా మనం అందరం కలిసి ఇక్కడే వినాయక చవితి చేసుకుందామని చెప్పారు అప్పుడే మీరు మర్చిపోయారా..? అని అడుగుతుంది.
పాపం కనకం తన కూతుళ్లను ఇంటికి తీసుకెళ్లాలని ఆశ పడుతుంది కద అపర్ణ అనగానే.. అంటూ ఇంద్రాదేవి చెప్పగానే.. నా కోడలిని నేను ఎక్కడికి పంపించను.. అది పండగ రోజు మన ఇంట్లోనే ఉండాలి అని చెప్తుంది ధాన్యలక్ష్మీ.. దీంతో ప్రకాష్ నీకు కోపమే కాదు ప్రేమ వచ్చినా తట్టుకోలేం.. ఇన్నాళ్లు కోడలి మీద కారాలు మిరియాలు నూరావు.. ఇప్పుడు మమకారాలు నూరుతున్నావా… అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ నువ్వు కాసేపు నోరు మూస్తావా..? అది కాదు కనకం.. మొదటి సారి నా కోడలు తల్లి కాబోతుంది. అది పండగ రోజు మహాలక్ష్మీ లాగా మా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతేనే కదా మాకు మంచి జరుగుతుంది అని చెప్పగానే.. పోనీ ఒక పని చేయ్ కనకం నలుగురిని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కంటే.. మీ ఇద్దరు ఇక్కడికే వచ్చేయండి.. అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం అంటుంది అపర్ణ.
అవును ఇది చాలా మంచి ఆలోచన అంటుంది ధాన్యలక్ష్మీ.. ఏంటి మంచి ఆలోచన.. అత్తగార్లుగా మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా..? అప్పు, కావ్యలు పుట్టింటికి వెళ్లి పండుగ చేసుకోవాలి అనుకుంటున్నారేమో..? అంటాడు సుభాష్. అలా ఏం లేదు మామయ్య గారు.. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు కావ్య అక్క చెప్పింది.. ఇక నుంచి ఇదే మన కుటుంబం వీళ్ళంతా మన మనుషులే అని ఆరోజు డిసైడ్ అయ్యాను ఇక నుంచి ఏం జరిగినా ఇక్కడే అని అప్పు చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అమ్మా కావ్య మరి నువ్వేం అంటావు.. అని సుభాస్ అడగ్గానే.. మా అత్తయ్యా మాట నా మాట అంటూ వేరు ఉండదు మామయ్య.. అత్తయ్య మాటే నా మాట అని కావ్య చెప్పగానే.. చూశావా..? అన్నయ్యా అత్తకొడళ్లు ఎప్పుడూ ఒక్కటే పార్టీ మనమే మధ్యలో వెళ్లకూడదు అంటూ ప్రకాష్ జోక్ చేస్తాడు. అందరూ నవ్వుకుంటుంటారు. అందరూ ఇక్కడ సంతోషంగా ఉన్నారు.. అత్తయ్యా క్షమించేసి ఉంటే వదిన కూడా ఇక్కడ అందరితో సంతోషంగా ఉండేది అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్తుంది కావ్య.
రాజ్ వెనకే వచ్చి ఏంటి కళావతి ఏమైంది..? ఇంత హ్యాపీ టైంలో అలా ఉన్నావేంటి..? రేపు మన ఇంట్లో నువ్వు కోరుకున్నట్టే వినాయక పూజ జరగబోతుంది. మీ అమ్మా నాన్న కూడా ఇక్కడికే వచ్చేశారు. అందరూ ఇక్కడే ఉన్నారు.. ఇంక నీ ప్రాబ్లమ్ ఏంటి కళావతి అంటూ అడగుతాడు. ఏం లేదండి.. అందరం కలిసి హ్యాపీగా ఈ పండుగ జరుపుకుందామని అనుకునే సరికి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది అంటూ రేవతి గురించి చెప్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. మా అక్క గురించి నీకెలా తెలుసు అంటూ అడుగుతాడు.
దీంతో కావ్య జరిగిన విషయం మొత్తం చెప్పి తను ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉందని చెప్తుంది. ఆవిడకు మీరంటే చాలా ఇష్టం అందుకే ఆవిడ కొడుకుకు కూడా మీ పేరే పెట్టుకుంది. కానీ ఆవిడను చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇంత పెద్ద ఇంటి కూతురు అయి ఉండి.. అలా కష్టాలు పడుతుంది అని కావ్య చెప్పగానే.. తను ఇప్పుడు ఎక్కడ ఉంది.. అని రాజ్ అడగ్గానే.. ఇక్కడే రహమత్‌నగర్ బస్తీలో ఉంది అని కావ్య చెప్పగానే.. రేవతిని తీసుకొద్దాం పద అని రాజ్ చెప్పగానే.. ఇంతకు ముందు రేవతిని తీసుకొచ్చిన విషయం.. అపర్ణ తిట్టిన విషయం చెప్తుంది కావ్య. అయితే.. రేపు పండగకే అక్కను తీసుకొద్దాం అని చెప్తాడు రాజ్.
ఇద్దరూ కలసి రేవతి ఇంటికి వెళ్లి.. జరిగింది చెప్తారు. రేవతి హ్యపీగా ఫీలవుతుంది. రేపు పూజకు రావాలని రేవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.. మరోవైపు హాస్పిటల్ లో ఉన్న అప్పు, కళ్యాణ్‌లకు డాక్టర్ షాక్ ఇస్తుంది. కావ్య కడుపులో బిడ్డకు ప్రాబ్లమ్ ఉందని కావ్య గర్భసంచి చాలా వీక్ గా ఉందని తను డెలివరీ వరకు బిడ్డను మోయలేదని చెప్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం