Intinti Ramayanam Today Episode September 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి మాత్రం చాలా రోజుల తర్వాత మంచి డ్రామా అని చూస్తున్నాను మంచి కిక్ ఇస్తుంది అని అనుకుంటుంది. అంత లోపలే అవని శ్రీకర్ ను తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అందరూ కలిసి వ్రతం చేస్తారు. పల్లవి మాత్రం షాక్ లోనే ఉండిపోతుంది.. నేను ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా సరే అది నాకే రివర్స్ అవుతుంది అని అనుకుంటుంది. అవనిని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కూడా నాకు మాత్రం రివర్స్ అవుతుంది ఏంటో నా కర్మ అని పల్లవి అనుకుంటుంది. పల్లవి ఇదంతా చేసింది అని తెలుసుకున్న అవని పల్లవి చంప పగలగొడుతుంది. పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నా కుటుంబం జోలికి వస్తే ఇక సహించేది లేదు గుర్తుపెట్టుకో అని అంటుంది. ఇదంతా పల్లవి చక్రధర్ తో చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి వాళ్ళ డాడ్ చెప్పినట్లే భరత్ ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే రాత్రి శ్రీకర్ ఫ్రెండ్ ని రమ్మని చెప్తుంది. అతను రాగానే మా శ్రీకర్ బావ చాలా మంచివాడు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది.. శ్రీయా రావడం చూసి పల్లవి ఇంకా రెచ్చిపోతుంది. శ్రీకర్ బావ లేకుంటే శ్రీయ ఎలా ఉంటుంది అసలే అది అమాయకురాలు అని కావాలనే పల్లవి శ్రీయాని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అది విన్న శ్రీయా ఇంట్లోకి వెళ్లి శ్రీకర్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది.
నువ్వు పెద్ద లాయర్ అయ్యుండి కూడా నిన్ను నువ్వు కాపాడుకోలేక పోయావు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో నీ వదిన జోలికి నువ్వు వెళ్ళకు అని ఎంత చెప్పినా సరే.. శ్రీకర్ మాత్రం మా వదిన దేవత అని అంటాడు.. నీకు నాకన్నా ఎక్కువగా మీ వదిన ఎక్కువ అయిపోయిందా.. నన్నెందుకు ప్రేమించావు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ఇప్పుడు నువ్వు జైలుకెళ్తే నా పరిస్థితి ఏంటి అని శ్రీయా అడుగుతుంది.. కానీ శ్రీకర్ మాత్రం ఎంత చెప్పిన సరే శ్రియ వినదు.
ఆరాధ్య అక్షయ్ దగ్గరకొచ్చి నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది నాన్న అని అడుగుతుంది.. అయితే తాతయ్యతో వెళ్లే కొనుక్కో అమ్మా అని అంటాడు.. కాదు నాకు నువ్వే తీసుకురావాలి నాన్న అని అడుగుతుంది.. డబ్బులు ఉన్నాయా డబ్బులు ఇవ్వనా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. నాకేం అవసరం లేదు నా దగ్గర ఉన్నాయి లే అని అక్షయ్ అంటాడు. అయితే ఆరాధ్య అవనీని పిలిచి మీరిద్దరూ తోడుగా వెళ్ళండి నాకు ఐస్ క్రీమ్ తీసుకురండి అని అంటుంది.. నాకు ఎవరి తోడు అవసరం లేదు నేను ఒక్కడినే వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను అని అంటాడు. నేనేమీ ఒకరి తోడుతో వెళ్లడానికి చిన్నపిల్లాడినేమీ కాదు అని అంటాడు.
దానికి రాజేంద్రప్రసాద్ అవని తోడు వస్తే నీకేంటి ఇప్పుడు ఇబ్బంది ఇద్దరు కలిసి వెళ్లి తీసుకురావచ్చు కదా అని అంటాడు. ఇక పల్లవి హాల్లో అటు ఇటు తిరుగుతూ ఏ దానికోసమో వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. భానుమతి టీవీ పెట్టుకుని చూడొచ్చు కదా ఎందుకంత తిరుగుతున్నావు అని అడుగుతుంది. ఇంట్లో జరిగే సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నానని పల్లవి మనసులో అనుకుంటుంది.. అప్పుడే శ్రీయా బ్యాగ్ సర్దుకొని అక్కడికి వస్తుంది..
ఏమైందమ్మా ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావని అందరూ అడుగుతారు. కానీ శ్రేయ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేంజ్ లో క్లాస్ పీకుతుంది.. పార్వతిని దారుణంగా అవమానిస్తుంది. నా భర్త రేపు చచ్చిపోయిన సరే మీరు ఇలానే మాట్లాడతారు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మీలాగా నేను భర్తను వదిలేసి ఒంటరిగా ఉండలేను. నాకు నా భర్త కావాలి. మీరు ఇంకొకసారి జైలుకు వెళ్లడం అని నాకు హామీ ఇవ్వండి అని శ్రియ అడుగుతుంది. ఆ మాట విన్న ప్రణతి మా అమ్మని అంత మాట అంటున్నారు అసలు మా వదిన ఏం చేస్తుంది అని మీరు అంటున్నారు అని అడుగుతుంది.
Also Read: ప్రేమను పరుగులు పెట్టించిన కళ్యాణ్.. ధీరజ్ ను కొట్టిన విశ్వం.. వల్లి ప్లాన్ సక్సెస్..
ఎవరు ఎంత చెప్పినా సరే శ్రియ ఎవరి మాట వినదు.. నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను నేను వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి పల్లవి అడ్డుపడి శ్రీయాను కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవి ప్లాన్ గురించి శ్రీయాతో చెప్తుంది. అటు అక్షయ్ అవనిలో కలిసిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…