BigTV English

OTT Movie : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

OTT Movie : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మైండ్ ని బెండ్ చేస్తుంటాయి. అలాంటి మూవీ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో అద్దెకు వచ్చిన అమ్మాయిని ఇంటి ఓనర్ టార్చర్ పెడుతుంటాడు. రాత్రి అయితే చాలు రెచ్చిపోతుంటాడు. ఆమెకు తెలీకుండా ఆమెతోనే అలాంటి పనులు చేస్తుంటాడు. ఈ స్టోరీ చివరి వరకు ట్విస్టులతో చూపు తిప్పుకోకుండా చేస్తుంది. కాకపోతే అలాంటి సీన్స్ ఉండటం వల్ల  ఒంటరిగా ఈ సినిమాని చూడాల్సి వస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే k

జూలియట్ న్యూయార్క్ లో ఒక డాక్టర్. తన భర్త జాక్ మోసం చేయడంతో విడాకులు తీసుకుని, బ్రూక్లిన్‌లో కొత్త జీవితం మొదలుపెట్టడానికి వస్తుంది. అక్కడ ఒక మంచి అపార్ట్‌మెంట్‌ని తక్కువ అద్దెలో తీసుకుంటుంది. ఆ అపార్ట్‌మెంట్ యజమాని మ్యాక్స్ చూడటానికి స్నేహపూర్వకంగా కనిపిస్తాడు. అతని తాత ఆగస్ట్ కూడా అక్కడే ఉంటాడు. జూలియట్, మ్యాక్స్‌తో ఫ్లర్ట్ చేస్తూ, ఒక రాత్రి అతనితో రొమాంటిక్‌గా గడుపుతుంది. కానీ తన ఎక్స్ జాక్‌పై ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయని గ్రహించి వెనక్కి తగ్గుతుంది. కానీ జూలియట్‌కి తెలియకుండా, మ్యాక్స్ ఆమెపై అనారోగ్యకరమైన అబ్సెషన్‌తో ఉంటాడు. ఆమె ఫ్లాట్ లో సీక్రెట్ గా కెమెరాలు పెట్టి గమనిస్తుంటాడు. రాత్రిపూట ఆమె నిద్రలో ఉన్నప్పుడు డ్రగ్ ఇచ్చి దారుణంగా ప్రవర్తిస్తుంటాడు.


జూలియట్ కి ఇక్కడ ఏదో జరుగుతోందని అనుమానం వస్తుంది. ఆమె కూడా అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ కెమెరాలు పెట్టి, మ్యాక్స్ చేసే పనులు చూసి షాక్ అవుతుంది. ఒక సారి మ్యాక్స్ ఆమెను బంధించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఆమె జాక్‌తో తిరిగి కలవాలనుకోవడం అతనికి కోపం తెప్పిస్తుంది. మ్యాక్స్ తన తాత ఆగస్ట్‌ని కూడా చంపేస్తాడు. అతను తన సీక్రెట్ ని బయట పెట్టచ్చని భయపడతాడు. చివరికి జూలియట్, మ్యాక్స్‌కి ఒక హింసాత్మక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారు ? మ్యాక్స్‌ వల్ల జూలియట్ కి ప్రమాదం వస్తుందా ? జూలియట్ చేతిలో మ్యాక్స్‌ స్టోరీ ముగుస్తుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘The Resident’ 2011లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఆంట్టి జోకినెన్ దర్శకత్వంలో, హిలరీ స్వాంక్, జెఫ్రీ డీన్ మోర్గాన్, లీ పేస్, క్రిస్టోఫర్ లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2011 ఫిబ్రవరి 18 థియేట్రికల్ రిలీజ్ అయింది. 1 గంట 31 నిమిషాల రన్‌టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో 5.3/10 రేటింగ్ ను పొందింది.

Read Also : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

Related News

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

OTT Movie : కిటికీలోంచి చూడకూడని సీన్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కుర్రాడు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పనమ్మాయితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే సీక్రెట్ రొమాన్స్… క్లైమాక్స్ లో బుర్రపాడు ట్విస్ట్

OTT Movie : 7 రోజులు ఏకాంతంగా… బిజినెస్ మ్యాన్ తో 20 ఏళ్ల అమ్మాయి బిగ్ డీల్… నెవర్ బిఫోర్ ఏరోటిక్ థ్రిల్లర్ మావా

Big Stories

×