E-Paper
Advertisement

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్..  అసలు అక్కడ ఏం జరిగిందంటే?
Advertisement

Viral Expressway Meal Video: రాజస్థాన్‌లో ఇటీవల ప్రారంభమైన ఓ ఎక్స్‌ ప్రెస్‌వేకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పెద్ద కుటుంబం రోడ్డు మీదే కూర్చొని భోజనం చేస్తున్న విజువల్స్ అందులో కనిపించడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ ప్రెస్‌ వేపై వాహనాలను ఆపి, రోడ్డునే పిక్నిక్ స్పాట్‌ గా మార్చేశారంటూ పలువురు విమర్శలు చేశారు. అయితే, ఈ వీడియోపై తాజాగా ఆ కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యారు. ఈ ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదని ఉందని కుటుంబ సభ్యుడు శివ్ ప్రకాష్ వెల్లడించారు.

అసలు వీడియోలో ఏం ఉంది?

Then Now Foreve అనే ఎక్స్‌ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాసేపట్లోనే వైరల్ అయింది. వీడియోలో కొంతమంది కుటుంబ సభ్యులు రోడ్డు మీదే కూర్చొని భోజనం చేస్తుండగా, మరికొందరు వారికి ఆహారం వడ్డిస్తున్నట్లు కనిపించారు. దీంతో వారు ఎక్స్‌ ప్రెస్‌ వే మీదే వాహనాలను నిలిపి భోజనం చేస్తున్నారని చాలామంది భావించారు. రహదారి భద్రతా నిబంధనలను పట్టించుకోలేదంటూ కామెంట్లు చేశారు. కొంతమంది ఎక్స్‌ ప్రెస్‌ వే మీద వాహనాలను ఆపడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేశారు. వేగంగా వెళ్లే వాహనాలు ఢీకొనే అవకాశం ఉన్నందున ఇలాంటి రోడ్లపై అనవసరంగా ఆగకూడదని సూచించారు.

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

Advertisement

వీడియో వైరల్ కావడంతో కుటుంబంపై విమర్శలు మరింత పెరిగాయి. రహదారులను పిక్నిక్ ప్రదేశంగా మార్చడం సరికాదని కొందరు మండిపడ్డారు. మరికొందరు మాత్రం కుటుంబానికి సపోర్టుగా నిలిచారు. వారు రోడ్డుకు అడ్డంగా కూర్చోలేదని, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించకపోతే అంతగా విమర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అసలు వీడియో తీసిన ప్రదేశం హైవేలో భాగం కాకపోవచ్చని, వాహనాలు ఆపేందుకు ఉపయోగించే లే బై అయి ఉండొచ్చని మరికొందరు వెల్లడించారు.

భారీ వర్షం.. పిల్లలు, వృద్ధులతో ప్రయాణం!

ఈ వివాదంపై కుటుంబ సభ్యుడు శివ్ ప్రకాష్ స్పందించారు. ఆగస్టు 12న హరియాళి అమావాస్య సందర్భంగా కుటుంబమంతా మీనాల్ జలపాతానికి వెళ్లినట్లు తెలిపారు. తిరిగి చిత్తోర్‌ గఢ్‌ కు వస్తున్న సమయంలో భారీ వర్షం కురవడంతో భోజనం కోసం కొద్దిసేపు ఆగాల్సి వచ్చిందని చెప్పారు. కుటుంబంలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని, సాయంత్రం 4:30 గంటల సమయంలో అందరికీ ఆకలి వేసిందని తెలిపారు. సమీపంలో రెస్టారెంట్, సరైన ప్రదేశం కోసం స్థానిక గ్రామస్థులను అడిగామని చెప్పారు.

గ్రామస్థులు చూపించిన లే బైలోనే భోజనం

Advertisement

స్థానికులు హైవే పక్కన వాహనాలు ఆపుకునే ఓ లే బై గురించి చెప్పారని శివ్ ప్రకాష్ వివరించారు. అక్కడ ట్రక్కులు కూడా సాధారణంగా ఆగుతుంటాయని తెలిపారు. అక్కడే కుటుంబం సుమారు 15 నిమిషాలు ఆగి భోజనం చేసి తిరిగి ప్రయాణం కొనసాగించిందని చెప్పారు. తాము హైవే మధ్యలో ఆగలేదని, ఇతర వాహనదారులకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.

Read Also: రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

Tags

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×