Horror mystery: హర్రర్ జానర్లో ఇప్పటిదాకా రకరకాల సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం వాటన్నింటి కంటే డిఫరెంట్ గా ఉంటుంది. పాత టేపుల్లో దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యాల నేపథ్యంలో సాగే కథ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మంచి మైండ్ బెండింగ్ సూపర్ నేచురల్ హారర్ జర్నీని చూడాలనుకుంటే ‘ఆర్కైవ్ 81’ (Archive 81) సిరీస్ మీ కోసమే. ఖచ్చితంగా ఈ మూవీని చూశాక వర్త్ వాచింగ్ మావా అంటారు. మరి ఈ మూవీ డీటైల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
కథ రెండు వేర్వేరు కాలాల్లో నడుస్తుంది. ఒకటి ప్రస్తుత కాలం, మరొకటి 1994వ సంవత్సరం. ప్రధాన పాత్ర డాన్ టర్నర్ టాలెంటెడ్ ఆర్కైవిస్ట్. అతను పాత ఆడియో, వీడియో టేపులను రిస్టోర్ చేయడంలో ఎక్స్పర్ట్. చిన్నతనంలోనే ఒక అగ్నిప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయిన బాధ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకరోజు వర్జిల్ డేవన్‌పోర్ట్ అనే రిచ్ వ్యాపారవేత్త అతన్ని సంప్రదిస్తాడు.
1994లో ‘ది విస్సర్’ అనే అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఘోరమైన అగ్ని ప్రమాదంలో తగలబడి పోతుంది. ఆ ప్రమాదంలో సగం కాలిపోయిన కొన్ని పాత వీడియో టేపులను రికవర్ చేయాలని డాన్ ను అడుగుతాడు. భారీ మొత్తం డబ్బు ఆఫర్ చేసి, ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ లేని ఒక మారుమూల రీసెర్చ్ ఫెసిలిటీలో ఒంటరిగా ఉంచుతారు. డాన్ ఆ టేపులను ఒక్కొక్కటిగా రికవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో మెలోడీ పెండ్రాస్ అనే యంగ్ పీహెడ్డీ విద్యార్థిని కనిపిస్తుంది.
1994లో తప్పిపోయిన తల్లిని వెతుక్కుంటూ ఆ ‘విస్సర్’ అపార్ట్‌మెంట్‌లోకి వస్తుంది మెలోడీ. అక్కడి నివాసితులను ఇంటర్వ్యూ చేస్తూ వీడియోలు రికార్డ్ చేస్తుంది. కానీ ఆ బిల్డింగ్ నార్మల్ బిల్డింగ్ కాదు. అక్కడి వాళ్ళంతా ‘కాల్గో’ అనే ఒక పరలోకపు రాక్షస దేవుడిని పూజించే గుప్త మతం సభ్యులు. మెలోడీ ఈ రహస్యాన్ని తెలుసుకున్న కొద్దీ ఆమె జీవితం ప్రమాదంలో పడుతుంది. డాన్ టేపులు చూస్తున్న కొద్దీ అతనికి మెలోడీతో ఒక అతీంద్రియ కనెక్షన్ ఏర్పడుతుంది.
ఆమె తనని సహాయం కోసం పిలుస్తున్నట్లు అతనికి భ్రాంతి కలుగుతుంది. అంతేకాదు, 1994లో జరిగిన అగ్నిప్రమాదానికి, తన కుటుంబం చనిపోయిన అగ్నిప్రమాదానికి ఏదో లింక్ ఉందని గ్రహిస్తాడు. ఈ రెండు కాలాల మధ్య జరిగే సంఘటనలు ఒకదానికొకటి లింక్ అవుతాయి. చివరి ఎపిసోడ్‌లో డాన్ ఆ రాక్షస శక్తుల సీక్రెట్ ను ఎలా బయట పెట్టాడు ? 1994లో చిక్కుకుపోయిన మెలోడీని రక్షించడానికి ‘దర్ఘా’ అనే మరో ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఏం జరిగింది ? అక్కడ వచ్చే ఊహించని ట్విస్ట్ ఏంటి ? డాన్ టైమ్ ట్రావెల్ అయ్యి 1994లో ఎలా చిక్కుకుపోతాడు ? షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
పాత వీడియో టేపులు, ఆడియో రికార్డింగులు… వాటిని రిపేర్ చేస్తున్నప్పుడు గతం నుంచి ఒక భయంకరమైన శక్తి ప్రస్తుతంలోకి చొరబడితే ? అదే ఈ సిరీస్. జేమ్స్ వాన్ లాంటి హారర్ మాస్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సిరీస్ Netflixలో ఇంగ్లీష్, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. 8 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ హారర్ ప్రేమికులను ఒక్కసారి పట్టుకుంటే వదలను.
Read Also: వరుసగా అమ్మాయిల హత్యలు… ఇలాంటి సైకో కిల్లర్ ను ఎక్కడా చూసుండరు భయ్యా