E-Paper
Advertisement

వరుసగా అమ్మాయిల హత్యలు… ఇలాంటి సైకో కిల్లర్ ను ఎక్కడా చూసుండరు భయ్యా

వరుసగా అమ్మాయిల హత్యలు… ఇలాంటి సైకో కిల్లర్ ను ఎక్కడా చూసుండరు భయ్యా
Advertisement

Crime Thriller: చిన్నారి మిస్ అవ్వడంతో మొదలయ్యే కథ ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుంది ? అందులోనూ వరుసగా మహిళలే చనిపోతే… ఒకే అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళను అక్కడే ఉండే కిల్లర్ టార్గెట్ చేస్తుంటే… ఎలా ఉంటుందో తెలియాలంటే ‘కాళిదాస్ 2’ (Kaalidas 2) సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అసలు కథ ఏంటి ? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ అంతా చెన్నై యురపాక్కంలో ఉన్న S.I.S. అపార్ట్‌మెంట్ లో నడుస్తుంది. న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న రోజు రాత్రి, ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే గోకుల్, సంజు దంపతుల నాలుగేళ్ల చిన్నారి మిత్ర అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. ఈ మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్‌స్పెక్టర్ కాళిదాస్ రంగంలోకి దిగుతాడు. అతనితో పాటు ఏసీపీ వైష్ణవి కూడా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది.

Advertisement

విచారణలో భాగంగా అదే అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన జూనియర్ లాయర్ స్టీఫెన్ అలియాస్ స్టీవ్ పై పోలీసులకు అనుమానం వస్తుంది. స్టీఫెన్‌కు గతంలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిన హిస్టరీ ఉంటుంది. కానీ సీనియర్ లాయర్ నటరాజన్ కోర్టులో వాదించి, ఆధారాలు లేవనే నెపంతో స్టీఫెన్‌ను బెయిల్‌పై విడుదల చేయిస్తాడు. ఈ లోపు మిస్సింగ్ అయిన పాప మిత్ర శవమై కనిపిస్తుంది. ఆ తర్వాత హర్షిత అనే మరో చిన్న అమ్మాయి స్విమ్మింగ్ పూల్‌లో మునిగి చనిపోతుంది.

అలాగే అపార్ట్‌మెంట్‌లో ఉండే డాక్టర్ ప్రసన్న బిల్డింగ్ పైనుంచి పడి అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఈ వరుస మరణాల వెనుక ఉన్న అసలు కిల్లర్ స్టీఫెనే అని పోలీసులు అనుమానిస్తారు. కానీ కాళిదాస్ దర్యాప్తు చేయగా అసలు నిజం బయట పడుతుంది. ఈ మరణాలన్నింటికీ కారణం స్టీఫెన్ కాదు, అపార్ట్‌మెంట్ సెక్రటరీ రూపా కూతురైన అనన్య అనే చిన్న అమ్మాయి అని తెలుస్తుంది. ఒకరోజు డ్రగ్స్ తీసుకున్న కొందరు వ్యక్తులను చూసి భయపడిన అనన్య, స్టీఫెన్ పెంచుకునే కుక్కను బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేస్తుంది. మరి ఆ కుక్కకు, మిత్ర చావుకు సంబంధం ఏంటి ? నిజాన్ని దాచడానికి రూపా ఏం చేసింది ? హర్షితను, డాక్టర్ ప్రసన్నను ఎలా చంపింది ? షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

Advertisement

భరత్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘కాళిదాస్ 2’ (Kaalidas 2). 2019లో వచ్చిన ‘కాళిదాస్’కు సీక్వెల్‌గా శ్రీ సెంథిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2026లో థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. మే 12 నుండి లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, Sun NXT, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×