E-Paper
Advertisement

OTT Movie : మరదలిపై బావ కన్ను … డబ్బు కోసం గలీజు పని… సస్పెన్స్‌తో చెమటలు పట్టించే సినిమా

OTT Movie : మరదలిపై బావ కన్ను … డబ్బు కోసం గలీజు పని… సస్పెన్స్‌తో చెమటలు పట్టించే సినిమా
Advertisement

OTT Movie : ఈ రోజుల్లో చిన్న పిల్లలు సేఫ్‌గా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయినా కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంటుంది. వాళ్ల మీద జరిగే అబ్యూస్, మానసిక హింస గురించి ఆలోచిస్తే గుండెలు పిండినట్లు అనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఒక తమిళ మూవీ సోషల్ మెసేజ్ ఇస్తూ రూపొందింది. ఇది తమిళ్ లో మొదటిసారి చైల్డ్ అబ్యూస్ మీద పూర్తిగా ఫోకస్ చేసిన మూవీ. వరుస హత్యలతో మొదలయ్యే ఈ కథ క్లైమాక్స్ వరకు ఊహించని మలుపులు తీసుకుంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఆరుద్ర’ 2018లో వచ్చిన తమిళ థ్రిల్లర్ మూవీ. పా. విజయ్ డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. అతనే హీరోగా కూడా నటించాడు. మెఘాలి, దక్షితా, సోన్యా చారిష్టా, కె.భాగ్యరాజ్, ఎస్.ఎ. చంద్రశేఖర్ లీడ్ రోల్స్ లో నటించారు. 2018 ఆగస్ట్ 31న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం Sun NXT, MX Player లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

శివ అనే యువకుడు చెన్నై లో అంటిక్ షాప్ నడుపుతుంటాడు. బయట చూస్తే చాలా కూల్‌గా, స్మైలింగ్‌గా ఉంటాడు. మరో వైపు నగరంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళను కిల్లర్ ఒక చోట చంపి, మరో చోట పడేస్తుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఎస్కేప్ అవుతుంటాడు. పోలీసులు గందరగోళంలో పడిపోతారు. ఇలాంటి సమయంలో అవుదయప్పన్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ కేసు తీసుకుంటాడు. ఇతను రిటైర్డ్ పోలీస్, చాలా షార్ప్ మైండ్. శివ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే మొదటి ఫ్లోర్‌లో రూమ్ తీసుకుని సీక్రెట్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. ఇదే సమయంలో శివఉండే అపార్ట్మెంట్ లో ఒక హత్య జరుగుతుంది. ఆధారాలను బట్టి చూస్తే డిటెక్టివ్ అవుదయప్పన్ కి శివ మీద అనుమానం వస్తుంది. కానీ ఖచ్చితంగా తెలియదు. శివతో అవుదయప్పన్ ఫ్రెండ్‌షిప్ పెంచుకుని, ఒక రోజు హిప్నాటిజం చేస్తాడు. అక్కడి నుంచి శివ అతని గతం బయటపెడతాడు.

Read Also : వరుస హత్యలు… టీనేజ్ అమ్మాయిలే టార్గెట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ మావా

Advertisement

శివ ఒక చిన్న గ్రామంలో ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాడు. అతనికి ఒక అక్కతో పాటు చెల్లి కూడా ఉంటుంది. అక్కకి పెళ్లి కూడా అవుతుంది. చెల్లి చదువుకుంటూ ఉంటుంది. అయితే శివ చెల్లి మీద అతని బావకి కన్ను పడుతుంది. అతనితో పాటు ఒక ధనవంతుడు కూడా ఆమెను అనుభవించాలని అనుకుంటాడు. దీంతో ఇద్దరూ కలసి ఆమెను భయంకరంగా అఘాయిత్యం చేస్తారు. వాళ్ళతో పాటు మరికొంత మంది కూడా ఈ దారుణానికి పాల్పడతారు. చావుబతుకుల మధ్య ఉన్న అతని చెల్లి శివకి జరిగింది చెప్పి చనిపోతుంది. దీంతో అతను వాళ్ళపై రివేంజ్ తీర్చుకోవడానికి ఈ హత్యలు చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న అవుదయప్పన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏంటి ? శివ జైలుకి వెళ్తాడా ? రివేంజ్ పూర్తి చేస్తాడా ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×