OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. భాష ఏదైనా భయపెడితే చాలు అన్న లెవెల్లో ఇలాంటి సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు మూవీ లవర్స్. ఇక ఇతర భాషల్లో ఉండే భయంకరమైన సినిమాలు తెలుగులో అందుబాటులో ఉంటే, ఇక హార సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉంటే పండగే పండగ. ఈరోజు మన మూవీ సజెషన్ లో తెలుగులో అందుబాటులో ఉన్న ఓ తమిళ హర్రర్ థ్రిల్లర్ గురించి చెప్పుకోబోతున్నాము. మరి ఆ మూవీ పేరేంటి? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే….
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా పేరు ‘రాట్ససన్’ (Ratsasan 2018). ఈ సినిమాలో హీరో హీరోయిన్లు విష్ణు విశాల్, అమలా పాల్ కెమిస్ట్రీ, నటన సినిమాకు హైలైట్. రొమాన్స్ మాత్రమే కాదు ఊహించని ట్విస్టులు, థ్రిల్ సీన్స్ సినిమాను ఎంగేజింగ్ గా చేస్తాయి. రామ్ కుమార్ డైరెక్షన్, స్క్రీన్‌ప్లే సస్పెన్స్ అండ్ ఎమోషన్స్‌ను బాగా బ్యాలెన్స్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అద్భుతం. IMDbలో ఈ మవవీకి 8.3 రేటింగ్ ఉంది. 2018 నుంచి ఇప్పటిదాకా తమిళ సినిమాల్లో టాప్ థ్రిల్లర్‌లలో ఇది కూడా ఒకటి. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ తమిళం, తెలుగు భాషలలొ అందుబాటులో ఉంది. ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు థ్రిల్లర్ జానర్లో వచ్చినా ఈ మూవీ మాత్రం కల్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దాన్ని బీట్ చేసే మూవీ ఇంకా రాలేదు. ఇక ఇదే మూవీని తెలుగులో ‘రాక్షసుడు’ టైటిల్ తో తెరకెక్కించారు. ఇందులో బెల్లమవకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఒకవేళ తమిళ వెర్షన్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.
అరుణ్ (విష్ణు విశాల్) అనే యువకుడు పోలీసు జాబ్ చేస్తూ, సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటాడు. ఆ కలను సాకారం చేసుకోవడానికే జాబ్ వదిలేస్తాడు. అయితే అతని తండ్రి మళ్లీ జాబ్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అరుణ్ వాల్మీకి (అమలా పాల్) అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె ఒక టీచర్. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఇలా సాఫీగా సాగుతున్న కథలో గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్.
Read Also : ఆడపిల్లలంటే పడి చచ్చే సైకో… డార్జిలింగ్‌లో పూడ్చి పెట్టే సీక్రెట్స్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్