E-Paper
Advertisement

Sexual Assault: రైలు ఎక్కుతుండగా మహిళను అక్కడ పట్టుకున్న ఆకతాయి, పోలీసులు ఏం చేశారంటే?

Sexual Assault: రైలు ఎక్కుతుండగా మహిళను అక్కడ పట్టుకున్న ఆకతాయి, పోలీసులు ఏం చేశారంటే?
Advertisement

రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రత పెంచినప్పటికీ ఆకతాయిలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా రైలు ఎక్కుతుండగా ఓ ఆకతాయి  మహిళను అసభ్యంగా తాకాడు. వెంటనే ఆమె అతడిని చేతిని పట్టుకుని, నిలదీయగా, తప్పించుని పారిపోయాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గంటల వ్యవధిలోనే ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్ లో జరిగింది.

ఇంతకీ అసలు ఏమయ్యిందంటే?

రైల్వే స్టేషన్‌ లో రైలు ఎక్కుతున్న సమయంలో ఒక మహిళను లైంగికంగా వేధించిన ఘటనలో 30 ఏళ్ల యువకుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కట్టకాడలోని మన్నంకోణంకు చెందిన సజీవ్ గా గుర్తించారు. శనివారం(నవంబర్ 22న) మధ్యాహ్నం ఓ మహిళ కన్యాకుమారి-పూణే ఎక్స్‌ ప్రెస్‌ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో రైలు దిగుతున్న సజీవ్ ఆమెను అనుచితంగా తాకాడు. ప్రైవేట్ పార్ట్స్ పై  అసభ్యంగా చేయి వేశాడు. సదరు మహిళ వెంటనే అతడి చేయి పట్టుకుని సీరియస్ అయ్యింది. వెంటనే అతడు తన చేతిని లాక్కుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో ఆమె అలారం మోగించింది. ఆ వ్యక్తి ప్లాట్‌ ఫారమ్ నుంచి పారిపోతున్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ క్లిప్ క్షణాల్లో వైరల్ అయ్యింది.

కొద్ది గంటల్లోనే సంజీవ్ అరెస్ట్

Advertisement

అటు ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా శనివారం నాడే సజీవ్‌ను అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. బీఎన్ఎస్ లోని సెక్షన్ 75(1)(i)  కింద అతడిపై అభియోగాలు మోపారు. సజీవ్‌ను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

Read Also: చావును దగ్గర  zనుంచి చూశాడు.. అదృష్టమంటే ఇతడిదేగా!

19 ఏళ్ల యువతిని రైలు నుంచి తోసేసిన కొద్ది రోజుల్లోనే..

Advertisement

ఇక రీసెంట్ గా పలోడ్‌కు చెందిన 19 ఏళ్ల యువతిని శ్రీకుట్టిని వర్కల సమీపంలో కదులుతున్న రైలు నుంచి తోసేసిన ఘటన జరిగి కొద్ది రోజుల్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో వెల్లరాడకు చెందిన  40 ఏళ్ల నిందితుడు సురేష్ కుమార్‌ను అరెస్టు చేశారు. వర్కల రైల్వే స్టేషన్ నుండి 1.5 కి.మీ దూరంలో కేరళ ఎక్స్‌ ప్రెస్ లో అర్చన అనే మరో ప్రయాణీకురాలిని కూడా అతను తోసేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. “సురేష్ అకస్మాత్తుగా అమ్మాయిని జనరల్ కంపార్ట్‌ మెంట్ నుంచి బయటకు తోసాడు. అతడు ఆమె స్నేహితురాలిని కూడా నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె కోచ్ లోపలికి తిరిగి పడిపోయింది” అని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో శ్రీకుట్టి తీవ్రంగా గాయపడింది. తలకు, కడుపుకు గాయాలయ్యాయి.  ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందుతుందని రైల్వే పోలీసులు వెల్లడించారు.

Read Also: నమో భారత్ లో పార్టీలు, ఫోటో షూట్స్.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×