E-Paper
Advertisement

Local Body Elections: లోకల్‌లో హిట్ కొట్టేందుకు.. కాంగ్రెస్ నయా స్కెచ్

Local Body Elections: లోకల్‌లో హిట్ కొట్టేందుకు.. కాంగ్రెస్ నయా స్కెచ్
Advertisement

Local Body Elections: జూబ్లీహిల్స్‌లో 25 వేల ఓట్లతో బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు గ్రామాల్లో హస్తం రంగు వేయాలని స్కెచ్ లు వేస్తోంది. 90 శాతం సీట్లు.. మెజారిటీ సర్పంచ్‌లు.. టార్గెట్ గా రేవంత్ ఆర్మీ ఇప్పటికే గ్రౌండ్‌లో దిగిపోయిందట. ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇళ్లు ప్రచారాస్త్రాలుగా మలిచి గ్రామాల్లో ప్రచార దండయాత్రకు సిద్ధమైందట. ఇంతకీ కాంగ్రెస్ మార్క్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది. పక్కా వ్యూహంతోనే మొదటగా పంచాయతీ ఎన్నికలు

కాంగ్రెస్ మార్క్ ఎలక్షన్ స్ట్రాటజీ

Advertisement

లోకల్ లో హిట్ కొట్టేందుకు స్కెచ్

90శాతం సీట్లు టార్గెట్

Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ తీసుకువచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 90శాతం సీట్లు సాధించి మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పక్కా ప్లాన్ చేస్తున్నదట. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుందని టాక్. స్థానిక ఎన్నికల అనంతరం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది. ఎవరెం చేసినా, ఎన్ని ప్లాన్స్ చేసినా.. .స్థానిక ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ బై పోల్ వచ్చిన రికార్డులే వస్తాయనిధీమా వ్యక్తం చేస్తున్నదట. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నదట హస్తం పార్టీ.

రెండేళ్ల ప్రగతి వివరణ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుండ టంతో ఈ రెండేళ్లలో సాధించిన ప్రగతిని వివరించేందుకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 1 నుంచి 9వరకు ప్రభుత్వం.. ప్రజాపాలన దినోత్సవాలను నిర్వహించబోతున్నది. ఈ వారోత్సవాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలు.. ఇప్పటికే అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమా లు, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రజా ప్రతినిధులకు సూచనలు చేసినట్లు సమాచారం.

రుణ మాఫీ, మహిళలకు రుణాలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు, మహిళలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించబోతున్నట్లు సమాచారం. రుణ మాఫీ, మహిళలకు రుణాలు, సబ్సిడీపై గ్యాస్, ఉచిత కరెంటు, ఉద్యోగాల కల్పన అంశాలను విస్తృతంగా ఇంటింటికి వివరించేందుకు సిద్ధమవుతుందట. అంతేగాకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సైతం ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందట. ఇప్పటికే మహిళా సంఘాల్లోని సభ్యులకు ఉచితంగా చీరల పంపిణీ చేపడుతుంది. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలోని నేతలను భాగస్వాములను చేస్తూ ప్రచార స్పీడ్ పెంచింది. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు సైతం జారీచేసింది. దీనికి తోడు ప్రభుత్వ పథ కాలతో పాటు చేస్తున్న సంక్షేమం, ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి చెందిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో సైతం వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్రచారం చేయాలని సోషల్ మీడియాకు సూచనలు చేసిందట.

ప్రభుత్వంపై విమర్శలకు గట్టి కౌంటర్లు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను మరోసారి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించిందట. అంతే గాకుండా ప్రభుత్వంపై విమర్శలకు గట్టి కౌంటర్లు ఇవ్వాలని ఇదే స్థానిక సంస్థల ఎన్నికల్లో అస్త్రంగా పనిచేస్తుందని చెప్పినట్టు సమాచారం. ప్రజల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు మననం చేస్తుండాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ మెజార్టీ సర్పంచ్ స్థానాలను సాధించడ మే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం సైతం ఆదేశాలు ఇస్తూ నేతలను అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

80శాతం గ్రామాల్లో విజయఢంకా

గ్రామాల్లో పట్టుకోసం కాంగ్రెస్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు మెజార్టీ సీట్లు సాధించే లక్ష్యం పెట్టుకుంది. 80శాతం గ్రామాల్లో అధికారపార్టీ విజయఢంకా మోగించేందుకు సిద్ధమైంది. అందుకే తొలుత గ్రామసర్పంచ్ లు, వార్డులకు ఎన్నికలకు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంగళవారం జరిగే కేబినెట్ లో తేదీలు ఫైనలైజ్ అవుతాయని తెలుస్తోంది. ఏది ఏమైన కాంగ్రెస్ మెజార్టీ సర్పంచ్ స్థానాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం సైతం ఆదేశాలు ఇస్తూ నేతలను అలర్టు చేస్తున్నది.

Story By Venkatesh, Bigtv Live

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×