E-Paper
Advertisement

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్
Advertisement

OTT Movie : కొన్ని సినిమాల స్టోరీలకి, నటుల యాక్టింగ్ కి, ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. ఇలాంటి సినిమాలకు అవార్డులు కూడా దక్కుతుంటాయి. థియేటర్లలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఒక రొమాంటిక్ వార్ మూవీ, ఆస్కార్ అవార్డుని కూడా పొందింది. ఈ సినిమా సినిమాటోగ్రఫీ విభాగంలో ఈ అవార్డ్ ని గెలుచుకుంది. ఇది ఇంగ్లండ్ రచయిత ఇయాన్ మెక్‌యువాన్ 2001లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ స్టోరీ 1930 నుంచి 2000ల వరకు జరుగుతుంది. రొమాంటిక్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

“అటోన్మెంట్” (Atonement) బ్రిటిష్ రొమాంటిక్ వార్ చిత్రం. జో రైట్ దర్శకత్వంలో జేమ్స్ మెక్‌అవాయ్, కీరా నైట్లీ, సైయెర్షా రోనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2007 సెప్టెంబర్ 7 న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం Amazon Prime Video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1935లో ఇంగ్లండ్‌లోని ఒక పెద్ద హౌస్‌లో టాలిస్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇంటి చిన్న కూతురు 13 ఏళ్ల బ్రయోనీ ఎప్పుడూ కథలు రాస్తూ, ఊహల్లో మునిగి ఉంటుంది. ఒక రోజు ఆమె అక్క సెసిలియా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి సెలవులకు ఇంటికి వస్తుంది. ఆ ఇంటి హౌస్‌ కీపర్ కొడుకు రాబీ టర్నర్ కూడా కేంబ్రిడ్జ్‌లో చదివాడు. అతను తెలివిగా, అందంగా ఉంటాడు. సెసిలియా, రాబీ మధ్య ఆకర్షణ మొదలవుతుంది. ఒక రోజు హౌస్ ఫౌంటెన్ దగ్గర సెసిలియా, రాబీకి ఒక లేఖ ఇస్తుంది. అందులో శృంగార పదాలు ఉంటాయి. ఇది చూసిన బ్రయోనీ ఆ లేఖ చదివి, రాబీని దుర్మార్గుడని అనుకుంటుంది. దీంతో కోపగించుకున్న బ్రయోనీ, తనపై తప్పుగా ప్రవర్తించాడని రాబీపై ఆరోపిస్తుంది. పోలీసులు రాబీని జైలుకు పంపుతారు. సెసిలియా బాధతో ఇంటి నుంచి లండన్ వెళ్లిపోతుంది.

Read Also : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

Advertisement

ఆ తరువాత రాబీ జైలు నుంచి బయటకు వచ్చి ఆర్మీలో చేరతాడు. ఫ్రాన్స్‌లో జరిగిన ఒక యుద్ధంలో రాబీ గాయపడతాడు. ఈ సమయంలో సెసిలియాను కలుసుకోవాలని రాబీ ఆశపడతాడు. సెసిలియా లండన్‌లో నర్స్ గా పని చేస్తుంటుంది. బ్రయోనీ 18 ఏళ్ల తర్వాత తన తప్పును తెలుసుకుంటుంది. ఆమె కూడా నర్స్ ట్రైనీ అవుతుంది. ఆమె సెసిలియాను కలుస్తుంది. అయితే సెసిలియా ఆమెను క్షమించదు. ఆసుపత్రిలో గాయపడిన సైనికులను చూసి, ఆమె పశ్చాత్తాపం పెరుగుతుంది. రాబీ యుద్దం నుంచి తప్పించుకుని సెసిలియాను కలుసుకుంటాడు. వాళ్ళు కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. చివరికి వీళ్ళు కలసి జీవిస్తారా ? బ్రయోనీని క్షమిస్తారా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×