E-Paper
Advertisement

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా
Advertisement

OTT Movie : కొన్ని ప్రేమ కథలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో, అంతే ట్రాజీడీ గా ముగుస్తాయి. అయితే మనసుని హత్తుకుంటాయి. అలాంటి ఒక ప్రేమ కథ ఈ ఏడాది ఓటీటీలోకి వచ్చింది. ఈ స్టోరీలో ఒక అమ్మాయి చనిపోయే వ్యక్తి ప్రేమలో పడుతుంది. వినడానికి విచిత్రంగానే ఉన్నా , చూడతాటానికి అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం కంట తడి పెట్టిస్తుంది. ఈ ఎమోషన్ ని మీరు కూడా ఫీల్ అవ్వాలనుకుంటే, ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళ్తే ..

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

“విష్ యూ వర్ హియర్” (Wish You Were Here) అనేది 2025లో విడుదలైన ఒక అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ చిత్రానికి నటి జూలియా స్టైల్స్ దర్శకత్వం వహించారు. ఇది ఆమెకు దర్శకురాలిగా తొలి చిత్రం. ఇందులో ఇసాబెల్లే ఫర్మాన్, మేనా మస్సౌద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యునైటెడ్ స్టేట్స్‌లో 2025 జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. 2025 ఫిబ్రవరి 4 నుండి Airtel Xstream Play, Jio hotstar, Apple TVలో హిందీ, తమిళం, తెలుగు ఆడియో ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చార్లెట్ అనే 29 ఏళ్ల అమ్మాయి. లండన్‌లో ఒక చిన్న రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పని చేస్తుంటుంది. ఆమె జీవితం రోజూ ఒకలాగే ఉంటుంది. పని చేసుకోవడం ఇంటికి వచ్చి సీరియల్స్ చూడటం, బెస్ట్ ఫ్రెండ్ హెలెన్‌తో మాట్లాడటం. ఆమెకు 30వ పుట్టినరోజు దగ్గర పడుతోంది. ఏదో తక్కువ అనిపిస్తుంది. జీవితం చాలా బోరింగ్ గా వెళ్తోంది. ఒక రాత్రి రెస్టారెంట్ మూసిన తర్వాత, చార్లెట్ బయట ఆడమ్‌ అనే వ్యక్తిని చూస్తుంది. అతను వర్షంలో నిలబడి సిగరెట్ తాగుతుంటాడు. అతను ఆమెను చూసి నవ్వి, ఒక డ్రింక్‌కి పిలుస్తాడు. ఆ రాత్రి ఇద్దరూ బార్ నుంచి బార్‌కి, రాత్రంతా మాట్లాడుకుంటూ సిటీ మొత్తం తిరిగేస్తారు.. చార్లెట్‌కి మొదటిసారి జీవితంలో ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఇద్దరూ ముద్దు కూడా పెట్టుకుంటారు. ఆ రాత్రి ఆమె అతని ఇంట్లోనే ఉంటుంది. మరుసటి ఉదయం ఆడమ్ నాకు ఉన్న సమయం తక్కువ అని చెప్తాడు.

Read Also : కలలు కన్న కొత్తింట్లో కలత పెట్టే సంఘటనలు… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

అతను నాకు అరుదైన క్యాన్సర్ ఉంది, కేవలం 6 నెలలు మాత్రమే బతుకుతాను అని చెప్తాడు. చార్లెట్ ఒక్క సారిగా షాక్ అవుతుంది. ఆడమ్ ఇక ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటాడు. కానీ చార్లెట్ అతన్ని వదలదు. డాక్టర్ అపాయింట్‌మెంట్స్‌కి వెళ్తుంది, అతని కుటుంబాన్ని కలుస్తుంది. స్కైడైవింగ్, రోడ్ ట్రిప్, స్విమ్మింగ్ కి తీసుకెళ్తూ అతనితో సమయం గడుపుతుంది. చార్లెట్ పని మానేసి, అతని కోసం పూర్తిగా సమయం కేటాయిస్తుంది. చార్లెట్ అతని ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ఒక చిన్న క్యాబిన్‌లో వీకెండ్ గడుపుతారు. అక్కడ ఆడమ్ ఆమెకు ఒక లేఖ ఇస్తాడు. “నువ్వు నాకు జీవితం ఇచ్చావు. ఇప్పుడు నువ్వు నీ జీవితం గడుపు అని అందులో ఉంటుంది. ఇక ఆడమ్ ఆసుపత్రిలో ఉంటాడు. చార్లెట్ అతని పక్కనే ఉంటుంది. అతను శాంతిగా, ఆమె చేతిలో చేయి పెట్టుకుని చనిపోతాడు. ఈ అద్భుతమైన కథ ఇలా ముగుస్తుంది.
Advertisement

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×