E-Paper
Advertisement

కళ్లు చెదిరే విజువల్స్…శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తొమ్మిది తోకల నక్క… ఆకట్టుకుంటున్న ఫాంటసీ సిరీస్

కళ్లు చెదిరే విజువల్స్…శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే  తొమ్మిది తోకల నక్క… ఆకట్టుకుంటున్న ఫాంటసీ సిరీస్
Advertisement

Romantic fantasy drama : కొరియన్, జపాన్ సిరీస్ ల తరువాత చైనీస్ కంటెంట్ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. రీసెంట్ గా ఓటీటీలోకి ఒక చైనీస్ ఫాంటసీ సిరీస్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కళ్ళు చెదిరే కత్తి యుద్ధాలు, మంత్ర తంత్రాలు, గాల్లో ఎగురుతూ చేసే ఫైట్లతో పాటు అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయి. మనుషులకి, రాక్షసులకి మధ్య జరిగే ఆధిపత్య పోరాటమే ఈ సినిమా అసలు కథ. మన భాషలో చెప్పాలంటే, ఇది ఒక మాయల మరాఠీ కథ లాంటిది. ఇందులో మనసుని హత్తుకునే ప్రేమ కథలు, విజువల్స్ భలే కిర్రాక్‌గా ఉంటాయి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2026లో వచ్చిన ఈ చైనీస్ ఫాంటసీ డ్రామా పేరు ‘వీల్ ఆఫ్ షాడోస్’ (Veil of Shadows). ఈ సిరీస్‌ని ప్రముఖ దర్శకుడు గువో జింగ్మింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల లాగే ఇందులో కూడా విజువల్స్, ఖరీదైన కాస్ట్యూమ్స్, అద్భుతమైన సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవన్నీ హాలీవుడ్ స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటుల విషయానికి వస్తే, చైనాలో విపరీతమైన క్రేజ్ ఉన్న జు జింగీ, తియాన్ జియారూయ్ ప్రధాన పాత్రల్లో నటించడం ఈ సిరీస్‌కు పెద్ద ప్లస్ అయ్యింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్ యువతను బాగా ఆకట్టుకున్నాయి.  ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో ఇది 2026లో టాప్ రేటెడ్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. 29 ఎపిసోడ్లతో ఈ సిరీస్ 2026 ఏప్రిల్ 1 నంచి  నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

లూ వుయ్ అనే తొమ్మిది తోకల నక్క, తన తెగ నుండి పారిపోయిన ఒక ప్రమాదకరమైన రాక్షసిని పట్టుకోవడానికి బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమె తన సోదరితో, రాక్షసులను వేటాడే కొందరు యోధులతో కలుస్తుంది. వీరంతా కలిసి ఆ రాక్షసి కోసం గాలిస్తూ అడవులు, కొండలు దాటుకుంటూ వెళ్తారు. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళకి “డ్రాగన్ శక్తి” గురించి తెలుస్తుంది. ఆ అపారమైన శక్తిని దక్కించుకోవాలని అటు రాక్షసులు, ఇటు స్వార్థపరులైన మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆ శక్తి తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కితే లోకానికి ప్రమాదమని గ్రహించిన లూ వుయ్, తన ప్రాణాలకు తెగించి దాన్ని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. చివరికి నమ్మకద్రోహాలు, భారీ యుద్ధాల మధ్య లూ వుయ్ తన స్నేహితులతో కలిసి ఆ శక్తిని ఎలా కాపాడింది? రాక్షసుల పీడ ఎలా వదిలించింది? అనేదే ఈ కథ.

Read Also : 15 మందిని బలితీసుకున్న రాత్రి… హెల్ హౌస్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలు… ఓటీటీలో వణికిస్తున్న సినిమా

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×