E-Paper
Advertisement

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా
Advertisement

Avatar 3 OTT Release : ‘అవతార్’ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! జేమ్స్ కామెరూన్ డైరెక్షన్‌లో వచ్చిన మోస్ట్ అవైటింగ్ మూవీ ‘అవతార్: ఫైర్ అండ్ యాషెస్’ (Avatar 3) థియేటర్లలో భారీ సక్సెస్ సాధించిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. ఈ చిత్రం ‘అవతార్’ ఫ్రాంచైజీలో మూడవ భాగం. 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకున్న ఈ మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

‘అవతార్: ఫైర్ అండ్ యాషెస్’ (Avatar: Fire and Ash)లో జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్), నెయిటిరి (జో సాల్డానా) కుటుంబం కేంద్రంగా కథ సాగుతుంది. పార్ట్ 2 లో తమ బిడ్డను కోల్పోయిన బాధ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేకుండా ఉంటారు. ఈ పరిస్థితిలో వారు కొత్త బెదిరింపును ఎదుర్కొంటారు. అగ్నిని పూజించే “యాష్ పీపుల్” (Ash People) అనే కొత్త నావి తెగ వారి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ తెగ చాలా ఆక్రమణాత్మకంగా, ప్రమాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా, మానవులు మళ్లీ పండోరాపై దాడి చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఈ రెండు ముప్పుల మధ్య జేక కుటుంబం ఎలా పోరాడుతుంది ? తమ కుటుంబాన్ని, పండోరాను ఎలా కాపాడుకుంటుంది ? అనేది ఈ చిత్రం ప్రధానాంశం. దుఃఖం, కుటుంబ బంధాలు, త్యాగం, పర్యావరణం, యుద్ధం వంటి భావాలు ఈ సినిమాలో స్ట్రాంగ్ గా ఉంటాయి.

ఓటీటీ రిలీజ్ డేట్

Advertisement

ఈ బ్లాక్‌బస్టర్ సినిమా 2026 జూన్ 24న జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ రిలీజ్ తర్వాత సాధారణంగా నెలలోపే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం 6 నెలల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ కు రావడం గమనార్హం. ఇంట్లో హై క్వాలిటీలో, ప్రత్యేకంగా 3D వెర్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో కూడా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. పండోరా ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది. అగ్ని అంశం ఆధారంగా వచ్చిన కొత్త తెగ డిజైన్, యాక్షన్ సీన్స్ థియేటర్‌లో ఆడియన్స్ కు మంచి ఫీల్ ఇచ్చాయి.

సామ్ వాషింగ్టన్, జో సాల్డానా, సిగౌర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్ వంటి నటులు తమ పాత్రలలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు.ఈ సినిమా కేవలం విజువల్ స్పెక్టాకిల్ మాత్రమే కాదు. కుటుంబం మధ్య ఉన్న బంధం, బాధ, ప్రతీకారం, మనుగడ కోసం పోరాటం వంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. అందుకే థియేటర్‌లో చూసిన చాలా మంది ఈ సినిమాను “అవతార్ సిరీస్‌లో బెస్ట్” అంటూ ప్రశంసించారు. జూన్ 24న జియో హాట్‌స్టార్‌లో వస్తున్న ఈ సినిమాను ఇంట్లో కూర్చుని హై క్వాలిటీలో చూడాలనుకునే వాళ్లు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను మార్క్ చేసుకుని, రెడీగా ఉండండి.

Advertisement

Read Also : శవం పక్కనే బుక్… పోలీసులకు హింట్ ఇస్తూ వరుస హత్యలు చేసే మెంటల్ సైకో

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×