BigTV English

OTT Movie : కప్పు టీ ఇచ్చిన పాపానికి కొంప కొల్లేరు చేసింది … పక్కా ప్లాన్ తో బోల్తా కొట్టించే లేడీ కిలాడీ మావా

OTT Movie : కప్పు టీ ఇచ్చిన పాపానికి కొంప కొల్లేరు చేసింది … పక్కా ప్లాన్ తో బోల్తా కొట్టించే లేడీ కిలాడీ మావా

OTT Movie : నిజజీవితంలో ఎంతోమంది మనకు పరిచయం అవుతుంటారు. వాళ్ళల్లో కొంతమంది వల్ల మంచి జరిగితే, మరికొంత మంది వల్ల జీవితం తలకిందులు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ డానీ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇతను ఒక మహిళ దిగులుగా ఉండటం చూసి ఒక కప్పు టీ ఉచితంగా ఆఫర్ చేస్తాడు. అదే అతని జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ అవుతుంది. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

డానీ డన్ (రిచర్డ్ గాడ్) అనే వ్యక్తి తాను పని చేస్తున్న పబ్‌లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూఉంటాడు. కామెడీ స్టేజ్ షోలలో కూడా ఇతను నటిస్తుంటాడు. ఒక రోజు మార్తా అనే మహిళ బాధలో ఉన్నట్లు కనిపించడంతో, డానీ ఆమెకు ఒక కప్పు టీ ఉచితంగా ఇస్తాడు. ఈ చిన్న దయాగుణం మార్తా, డానీ పట్ల వవిపరీతమైన ప్రేమను పెంచుకుంటుంది. ఆమె అతన్ని ఫాలో చేయడం మొదలుపెడుతుంది. మార్తా, డానీకి 41,000 ఈమెయిల్స్, 350 గంటల వాయిస్‌మెయిల్స్, 744 ట్వీట్స్, 46 మెసేజ్‌లు మరియు 106 పేజీల లేఖలను పంపుతుంది. అతని వ్యక్తిగత జీవితంలోకి కూడా చొచ్చుకొని వెళ్తుంది. ఆమె అతని కామెడీ షోలకు హాజరవుతుంది. అతని కుటుంబాన్ని, స్నేహితులను కూడా ఇబ్బంది పెడుతుంది.


మార్తా వల్ల డానీ జీవితం అయోమయంలో పడుతుంది. ఆమె నుంచి అతను లైం*గిక వేధింపులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. డానీ ఆమె పట్ల ఏమేమి తప్పులను చేశాడో గుర్తుకు తెచ్చుకుంటాడు. అతను మార్తాతో కొన్నిసార్లు సరసాలాడి, ఆమె ఫాంటసీలను అనుకోకుండా నిద్రలేపుతాడు. అప్పట్నుంచి అతనే తనకు సర్వస్వం అన్నట్టుగా ఉంటుంది మార్తా. చివరికి మార్తాను డానీ ప్రేమిస్తాడా ? ఆమె వల్ల ఇంకెన్ని సమస్యలు వస్తాయి ? ఆమె ఫాంటసీలను డానీ తీరుస్తాడా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : చంపిన వాళ్లే తిరిగొచ్చి టార్చర్ చేస్తే… ఇలాంటి సైకో కిల్లర్ మూవీని ఎక్కడా చూసి ఉండరు భయ్యా

 

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ బ్రిటిష్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘బేబీ రైండీర్’ (Baby Reindeer). 2024 లో వచ్చిన ఈ సిరీస్ ను స్కాటిష్ కమెడియన్ రిచర్డ్ గాడ్ రూపొందించారు. ఇందులో అతను రచయితగా, నిర్మాతగా, నటుడిగా కూడా పనిచేశాడు. ఇది అతని నిజ జీవిత అనుభవాల ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్ ఏడు ఎపిసోడ్‌లను కలిగి ఉంది.2024 ఏప్రిల్ 11న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ‘బేబీ రైండీర్’ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆరు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ఈ మూవీ గెలుచుకుంది.

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×