OTT Movie : బెంగాలి ఇండస్ట్రీ నుంచి వచ్చే వెబ్ సిరీస్ లు మంచి కంటెంట్ తో వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా, క్రైమ్, హారర్ జోనర్లో సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మూడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
చోర్కీ (Chorki) లో స్ట్రీమింగ్
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఆధునిక్ బంగ్లా హోటల్’ (Adhunik bangla hotel). దీనికి కాజీ ఆసద్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు మోషారఫ్ కరీమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ స్టోరీ బెంగాలీ వంటకాల చుట్టూ తిరిగే ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ . ఈ సిరీస్‌లో మూడు ఎపిసోడ్‌లు ఉంటే, ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక బెంగాలీ వంటకాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సిరీస్ చోర్కీ (Chorki) అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
బోల్ మాచర్ ఝోల్ (Boal Macher Jhol):
ఈ ఎపిసోడ్‌లో ఒక రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తన విద్యార్థి అజీజ్ ఆహ్వానం మేరకు ఒక గ్రామానికి వస్తాడు. నిజానికి ప్రొఫెసర్ అక్కడికి రావడానికి కారణం, ఆ ఊర్లో దయ్యాలు ఉన్నాయనే పుకార్లు రావడం, బోల్ మాచర్ ఝోల్ (బోల్ ఫిష్ కర్రీ) అనే వంటకం రుచి చూడడం. ఈ రెండిటి కోసమే అతను ఆ గ్రామానికి వస్తాడు. ఇక ఆరోజు చంద్రుని వెలుగులో సరస్సు ఒడ్డున ఫిషింగ్ చేస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో చనిపోయినవారు తిరిగి లేచి సాధారణ జీవితం గడుపుతున్నారని, అక్కడకి వచ్చినాక ప్రొఫెసర్ తెలుస్తుంది. ఆ గ్రామం అంతా దెయ్యాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు స్టోరీ అనూహ్యమైన మలుపును తీసుకుంటుంది.
ఖాసిర్ పాయ (Khasir Paya):
ఈ ఎపిసోడ్ రఫీక్ అనే భయస్థుడైన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఎక్కడైనా సరే, ఒంటరిగా ఉండడానికి భయపడతాడు. ఒక సారి అతని భార్య అతనికి ఇష్టమైన ఖాసిర్ పాయ (గొర్రెల కాళ్ల కూర) వండి బయటకు వెళుతుంది. అయితే ఆ తర్వాత అతను మూడు రాత్రులు ఒంటరిగా గడపవలసి వస్తుంది. ఒక బాలుడు ఖాసిర్ ను, పాయ కొనడానికి డబ్బు అడిగినప్పుడు రఫీక్ నిరాకరిస్తాడు. ఆ తర్వాత వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి.
హాసర్ సలూన్ (Hasher Salun):
ఈ స్టోరీ మోజు అనే ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. అతను హత్యలు చేసిన తర్వాత, హాసర్ సలూన్ (డక్ కర్రీ) తినడానికి ఇష్టపడతాడు. ఒక రోజు ఒక హత్య చేసిన తర్వాత, అతను తీవ్రంగా గాయపడి ఆధునిక్ బంగ్లా బోర్డింగ్ అనే హోటల్‌లోకి హాసర్ సలూన్ తినడానికి వస్తాడు. అక్కడికి వచ్చినాక బయటకు వెళ్లలేకపోతాడు. ఎందుకు వెళ్లలేక పోతున్నాడు అనేది ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ఫైట్లూ లేవు, లవ్వూ లేదు… ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్