E-Paper
Advertisement

BSNL jobs: బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.. చాలా మంచి వేతనం, ఇంకా 24 గంటలే ఛాన్స్

BSNL jobs: బీఎస్ఎన్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.. చాలా మంచి వేతనం, ఇంకా 24 గంటలే ఛాన్స్
Advertisement

BSNL jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నుంచి నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

నోట్: రేపటితో దరఖాస్తు గడువు ముగింపు (నవంబర్ 13)

Advertisement

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నియామకం టెలికాం, ఫైనాన్స్ విభాగాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120

Advertisement

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం), సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివరాలు:

సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం)- 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్)- 25 పోస్టులు

విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ లేదా తత్సమాన ఇంజినీరింగ్‌ డిగ్రీ, సీఏ, సీఎంఏ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.24,900- రూ.50,500 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం:  కంప్యూటర్‌ ఆధారిత మల్టిపుల్‌ చాయిస్‌ అబ్జెక్టివ్‌ టైప్‌ రాత పరీక్ష, సర్టిఫికేట్ పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

నోట్: దరఖాస్తు గడువు రేపటితో  ముగియనుంది.

అఫీషియల్ వెబ్ సైట్:  https://bsnl.co.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 120

దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 13.

ALSO READ: RRB JE: బంగారం లాంటి ఉద్యోగాలు భయ్యా.. ఎప్పుడో ఓసారి పడే నోటిఫికేషన్.. లైఫ్ సెట్ అంతే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×