BigTV English

OTT Movie : నన్, గర్ల్ ఫ్రెండ్ తో స్కూల్లోనే ఇదెక్కడి అరాచకంరా అయ్యా ? మొత్తం అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie :  నన్, గర్ల్ ఫ్రెండ్ తో స్కూల్లోనే ఇదెక్కడి అరాచకంరా అయ్యా ? మొత్తం అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : వీకెండ్ మంచి మసాలా మూవీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. ఈ సినిమాలో మొత్తం అలాంటి సీన్లే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో లేదంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూసే సాహసం చేశారంటే ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైలెంట్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘Bad Sister’. 2016లో వచ్చిన ఈ అమెరికన్ లైఫ్‌టైమ్ టీవీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా, ఒక కాథలిక్ స్కూల్‌లోకి కొత్త నన్‌గా వచ్చిన మహిళ సీక్రెట్ పాస్ట్, ఆమె ఒక యంగ్ విద్యార్థిపై చూపించే ఆకర్షణ అనే స్టోరీతో తెరకెక్కింది. ఈ సినిమా షాకింగ్ సన్నివేశాలు, సస్పెన్స్, ఒక విచిత్రమైన విలనిజంతో నిండి ఉంటుంది, ఇది Obsession (2019) లాంటి సినిమాలను ఇష్టపడే వారికి నచ్చవచ్చు. ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
జాసన్ బ్రాడీ (డెవాన్ వెర్ఖైజర్), అతని చెల్లెలు జో (ర్యాన్ న్యూమాన్) సెయింట్ అడెలైన్ కాథలిక్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు. జాసన్ ఒక ఆన్‌లైన్ సింగర్, అతని మ్యూజిక్ వీడియోలు ఇంటర్నెట్‌లో పాపులర్. స్కూల్‌లో సిస్టర్ సోఫియా వైట్ (అలిషియా ఓచ్సే) అనే కొత్త నన్ టీచర్‌గా వస్తుంది. ఆమె అందరినీ ఆకర్షిస్తుంది. కానీ ఆమె ప్రవర్తన వింతగా ఉంటుంది. ఆమె రెడ్ లిప్‌స్టిక్ వాడుతుంది, మార్నింగ్ ప్రేయర్‌ను స్కిప్ చేస్తుంది. జోకు సోఫియా తన సోదరుడు జాసన్‌పై అతిగా ఆసక్తి చూపిస్తున్నట్లు గమనిస్తుంది.


నిజానికి సోఫియా అసలు నన్ కాదని, ఆమె అసలు నన్ లా ప్రవర్తించట్లేదని జో కనిపెడుతుంది. ఆ నిజం ఏంటో కనిపెట్టే ప్రయత్నంలో ఉంటుంది. మరోవైపు లారా జాసన్‌ కు దగ్గర కావడానికి అతనితో సన్నిహిత సంబంధం పెట్టుకుంటుంది. దానిని రహస్యంగా వీడియో తీస్తుంది. లారా తన రహస్యం బయటపడకుండా ఉండేందుకు, జాసన్‌కు ఇష్టమైన మరో స్టూడెంట్ సారా (స్లోన్ అవెరీ)ను మాదక ద్రవ్యాలు వాడుతుందని చెప్పి సస్పెండ్ చేయిస్తుంది. జోను చీటింగ్‌లో ఇరికిస్తుంది.

Read Also : మగ దెయ్యానికి పూజలు చేసి, పెళ్లాడే అమ్మాయిలు… చేతబడులతో పిచ్చెక్కించే చీకటి ప్రపంచం

జో తన అనుమానాలను స్కూల్ హెడ్ సిస్టర్ రెబెక్కా (హెలెన్ ఐగెన్‌బెర్గ్)తో పంచుకుంటుంది. కానీ లారా ఆమెను కూడా లాంప్‌తో కొట్టి ఆపడానికి ప్రయత్నిస్తుంది. చివరకు జో, జాసన్ లారా నిజమైన గుర్తింపును ఆమె ల్యాప్‌టాప్‌లోబె కనిపెడతారు. ఆ నిజం ఏంటి? లారా ప్లేస్ లో స్కూల్ కు రావాల్సిన సిస్టర్ ఎవరు ? లారా ఇదంతా ఎందుకు చేసింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×