Ration cards: కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ కార్యక్రమం జరగనుంది.
ఎన్నికల సమయంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జనవరి 26 తర్వాత మొదలైన కొత్త రేషన్ కార్డ్‌ల జారీ ప్రక్రియ నిరాటంకంగా సాగుతుంది. రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. జనవరి 26 నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి.
ALSO READ: Watch Video: ఐఏఎస్ ఆఫీసరై ఉండి.. స్టూడెంట్‌తో దారుణ ప్రవర్తన, వీడియో వైరల్
ఆ తర్వాత మే 24 నుంచి ఇప్పటి వరకు మరో 3.58లక్షల కార్డులను ఆన్‌లైన్‌లో జారీ చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ చట్టం కింద రేషన్ కార్డ్‌ల స్థానంలో ఆహార భద్రత కార్డ్‌లు జారీ చేసింది.
ALSO READ: Job Updates: 1340 జేఈ ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం నీదే భయ్యా
గతంలో రాష్ట్రంలో 55 లక్షల కార్డులు మాత్రమే ఉండగా.. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డ్‌లతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డ్‌లను జారీ చేశారు. జారీ చేసినవి, తొలగించిన కార్డ్‌లు పోగా.. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాటికి ఆ సంఖ్య 89.95 లక్షలకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్త కార్డ్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలగింపులు, చేరికలు అయిన తర్వాత.. రాష్ట్రంలో రేషన్ కార్డ్‌లు పొందేందుకు అర్హులుగా 3.09 కోట్ల మంది ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు.