OTT Movie : హర్రర్ సినిమాల్లోనూ చేతబడులతో పిచ్చెక్కించే సినిమాలకు ఉండే క్రేజే వేరయా. ఏ జానర్లో వచ్చే సినిమాలంటే చెవి కోసుకునే వారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు ఎంత భయమేసినా, అవసరమైతే కళ్ళు మూసుకుని, దుప్పటి కప్పుకుని చూసే క్రేజీ మూవీ లవర్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఓ అదిరిపోయే మూవీ సజెషన్ ను తీసుకొచ్చేశాము. మరి ఈ మూవీ కథేంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో చూద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “The Demon’s Bride”. అజార్ కినోయి లూబిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2025లో విడుదలైన ఇండోనేషియన్ హారర్ చిత్రం. దీన్ని “పెంగాంటిన్ ఇబ్లిస్” అనే పేరుతో కూడా పిలుస్తారు. టాస్క్యా నమ్యా, వాఫ్డా సైఫన్ లూబిస్, ఆర్లా ఐలానీ, గివినా లుకిటా ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఒక తల్లి తన కుమార్తెను రక్షించడానికి ఒక దెయ్యంతో చేసుకునే ఒప్పందం చుట్టూ తిరిగే సూపర్‌నాచురల్ హారర్ చిత్రం.
కథలోకి వెళ్తే…:
రాంటి (టాస్క్యా నమ్యా) తన కుమార్తె నీనా (షక్వీనా మెడినా)ను ఎంతగానో ప్రేమిస్తుంది. నీనా జన్మతః వైకల్యంతో ఉంటుంది. అందుకే ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆ తల్లి. ఒక రోజు నీనా ఘోరమైన ప్రమాదానికి గురవుతుంది. ఆమెకు వెంటనే చికిత్స అవసరం. కానీ నీనాను రక్షించడానికి రాంటి నిస్సహాయ స్థితిలో ఒక దెయ్యంతో ఒప్పందం చేసుకుంటుంది. దీనిలో ఆమె “దెయ్యం వధువు”గా మారడానికి అంగీకరిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా ఆ తల్లి నీనాను కాపాడుతుంది. కానీ దానికోసం ఆమె భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.
రాంటి కుటుంబ సభ్యుల జీవితాలు, ఆమె భర్త బోవో (వాఫ్డా సైఫన్ లూబిస్), అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు ఈ దెయ్యం శక్తి వల్ల ఊహించనంత భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. దెయ్యం ఆవహించడంతో రాంటి జీవితం గందరగోళంగా మారుతుంది. ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. తనలో తాను నవ్వుకోవడం, కాంతికి భయపడటం, ఒకే సమయంలో వేర్వేరు ప్రదేశాలలో కనిపించడం వంటివి చేస్తూ ఫ్యామిలీని భయపెడుతుంది.
ఆమె అత్తగారు సిటి (గివినా లుకిటా) రాంటి పిచ్చి చేష్టలను వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీనితో రాంటి కోపంతో సిటిని మార్కెట్‌లో కత్తితో బెదిరిస్తుంది. తర్వాత ఆమెను దారుణంగా హత్య చేస్తుంది. ఆమె గర్భంలోని శిశువును తీసి, బాక్‌యార్డ్‌లో పాతిపెడుతుంది. రాంటి కోపంతో ఆమె అత్తమామలు, బావమరిది, భర్త బోవోను కూడా చంపడంతో కుటుంబం మొత్తం నాశనమవుతుంది. క్లైమాక్స్‌లో, నీనా రాంటి ముందు కుప్పకూలడంతో స్పృహలోకి వస్తుంది.
Read Also : భర్త లేని టైమ్ లో మరో వ్యక్తితో… ఆమె చేసిన తప్పుకు భర్త ఏం చేస్తాడో తెలిస్తే ఫ్యూజులు అవుట్