E-Paper
Advertisement

సాంగ్స్ పాడితే చావగొట్టే దెయ్యం… ఇదెక్కడి అరాచకం సామీ ?

సాంగ్స్ పాడితే చావగొట్టే దెయ్యం… ఇదెక్కడి అరాచకం సామీ ?
Advertisement

Horror Thriller: రాత్రి అంటే చాలా మంది భయపడతారు. కానీ ఆ భయం చీకటి వల్ల మాత్రమే కాదు, దెయ్యాలు భూతాల గురించి. అయితే ఒక గ్రామంలో మాత్రం రాత్రి పాటలు పాడినా, స్త్రీ గొంతు పిలిస్తే వెనక్కి తిరిగి చూసినా చావు మూడినట్టే. ఆ భయంకరమైన శాపం కథ ఏంటో తెలియాలంటే ‘రాత్ కా రాగ్’ (Raat Ka Raag) అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ మూవీ కథ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ ఓ ఊర్లో సాగుతుంది. ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులు ఓ మారుమూల గ్రామానికి వస్తారు. దుర్గాపూజ సమయంలో ఇదంతా జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ కాలానికి చెందిన కళాకారిణి ‘నిశిగంధ’ గురించి పరిశోధన చేయడానికి ‘సోనాముఖి’ అనే గ్రామానికి వస్తారు. ఆ గ్రామం పైకి చాలా ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది ఆ ఊరు. కానీ రాత్రి పడగానే ఆ గ్రామం ఒక భయంకరమైన స్థలంగా మారిపోతుంది.

Advertisement

సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ పాటలు పాడకూడదు, ఏ స్త్రీ గొంతు పిలిచినా వెనక్కి తిరగకూడదు అని చెప్తారు గ్రామస్తులు. ఎవరైనా ఆ నియమాలను ఉల్లంఘిస్తే ‘నిశి’ అనే శక్తి వారిని దారుణంగా చంపేస్తుందని నమ్ముతారు. మొదట్లో ఈ హెచ్చరికలను విద్యార్థులు నవ్వుతూ కొట్టిపారేస్తారు. కానీ రాత్రి వేళ ఒకరి తర్వాత ఒకరు వింతగా చనిపోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. ప్రతి మరణం ఒక రహస్య సంగీతంతోనే ముడిపడి ఉంటుంది.

ఆ సంగీతం వినగానే శరీరం వణుకుతుంది, మనసు భయంతో నిండిపోతుంది. ఇలాంటి సమయంలో వారిలో ‘తిత్లీ’ అనే అమ్మాయి ఈ శాపం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. గతంలో ఇదే గ్రామంలో ‘నిశి’ అనే అతీంద్రియ శక్తి ఆరుగురు సంగీతకారులను దారుణంగా చంపేసినట్లు తెలుస్తుంది. నెమ్మదిగా నిశిగంధ అనే మహిళ గతానికి సంబంధించిన కథ బయట పడుతుంది. ఆమె జీవితంలో జరిగిన అన్యాయాలు, ఆ తర్వాత ఆమె ఆత్మ ఎలా ఒక శాపంగా మారింది అనే విషయాలు ఒక్కొక్క ఎపిసోడ్‌లో వెలుగులోకి వస్తాయి.

Advertisement

విద్యార్థులు తమ స్నేహితులను కోల్పోతూ, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. చివరి ఎపిసోడ్‌లో ఆ రాత్రి వేళ ఒక పాడుబడిన పాత మహల్‌లో వాళ్ళంతా చిక్కుకుపోతారు. అక్కడ ఆ శక్తి స్టూడెంట్స్ లో ఒకరిని ఆవహిస్తుంది. ఆ ఆవాహన వెనుక చాలా షాకింగ్‌ ట్విస్ట్ ఉంటుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటి ? నిశి గతం ఏంటి ? ఆమె ఎందుకు శాపంగా మారింది ? ఆ ఆత్మను శాంతింపజేయడానికి ఆ విద్యార్థులు ఏం చేశారు ? చివరికి అక్కడి నుంచి బయట పడ్డారా లేదా ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయండి.

ఏకంగా నాలుగు ఓటీటీలలో

బెంగాలీ ఒరిజినల్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం హిందీ డబ్బింగ్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో Amazon MX Player, Hoichoi, Amazon Prime Video, Airtel Xstreamలలో అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో ఇంకా రాలేదు. కాబట్టి హిందీ లేదా ఇంగ్లీష్ లోనే చూడాలి. మొత్తం 6 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ను రాత్రిపూట ఒంటరిగా మాత్రం చూడొద్దు.

Read Also: లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

Related News

పాత వీడియో టేపులను బాగు చేయడానికెళ్తే బయటపడే పాతిపెట్టిన నిజం… క్లైమాక్స్ కెవ్వు కేక

సమయాన్ని దొంగిలించే శక్తులు… ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మరో మాస్టర్ పీస్

భారీ యాక్షన్ సీన్స్ లేవు, స్టంట్స్ లేవు… టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న సిరీస్

అమ్మబాబోయ్… ప్రేమను నిరూపించుకోవడానికి సినిమాను మించిన స్టంట్

రాత్రి వేళల్లో సేవకులను చంపి తినే రాజు… క్రేజీ కొరియన్ హిస్టారికల్ హర్రర్ థ్రిల్లర్ సిరీస్

పాకిస్తాన్ లో ఫేక్ నేమ్ తో ఇండియన్ ఏజెంట్… ప్రతి అడుగు ప్రాణసంకటంగా మారే స్పై థ్రిల్లర్

ఈ ఊర్లో డైరెక్ట్ గా దేవుడే చంపేస్తాడు భయ్యా… సీన్ సీనుకో ట్విస్ట్ తో సినిమా చూపించే సిరీస్

Big Stories

Advertisement
×