E-Paper
Advertisement

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా

లవర్ కు మతిమరుపు వస్తే… కన్నీళ్ళు పెట్టించే తెలుగు రొమాంటిక్ డ్రామా
Advertisement

Telugu Romantic Drama: కొన్ని ప్రేమకథలు ఒక్కసారి చూస్తే జీవితాంతం మరిచిపోలేము అన్నట్టుగా ఉంటాయి. అలాంటి లవ్ స్టోరీస్ ఓటీటీలో చాలా అరుదుగా దొరుకుతాయి. అలాంటి వాటి లిస్ట్ లో ఉండే తెలుగు మూవీనే ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). కెరీర్ కోసం స్ట్రగుల్ అయ్యే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి జీవితంలో ఎలాంటి విషాదం చోటు చేసుకుంది ? అన్న అంశంతో రూపొందిన ఈ మోడ్రన్ ఎమోషనల్ స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది తెలియాలంటే ముందుగా డీటైల్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

నెల్లూరు నుండి చెన్నైకి ఇంటీరియర్ డిజైనర్ ఉద్యోగం కోసం వస్తాడు మన హీరో శివ సాయి ప్రతాప్. సరైన అవకాశాలు రాకపోవడంతో రూమ్ రెంట్ కట్టుకోవడానికి పార్ట్ టైమ్ బైక్ టాక్సీ రైడర్‌ గా పని చేస్తుంటాడు. చిత్తూరుకు చెందిన మిత్ర మన హీరోయిన్. ఐటీ ఉద్యోగం కోసం చెన్నై వచ్చి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా రిజెక్ట్ అవుతుంటుంది. ఒకరోజు బైక్ పూలింగ్ యాప్ ద్వారా మిత్ర, శివ బైక్‌పై ప్రయాణిస్తుంది. అంటే రాపిడో లాగా అన్నమాట. ఈ ప్రయాణంలో వీరిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది.

Advertisement

అంతలోనే మిత్ర తన పాత హాస్టల్ ఖాళీ చేయాల్సి రావడంతో, చెన్నైలో కొత్త రూమ్ కోసం శివ సహాయంతో చాలా వెతుకుతుంది. ఎక్కడా రూమ్ దొరక్కపోవడంతో, శివ తన ఇంట్లోనే రెంట్ షేర్ చేసుకుంటూ కలిసి ఉందామని ఆఫర్ ఇస్తాడు. మొదట సంకోచించినా మిత్ర దానికి ఒప్పుకుంటుంది. కలిసి ఉన్న సమయంలో మిత్ర, శివకు ఒక మంచి ప్రొఫెషనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, అతనికి ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేలా హెల్ప్ చేస్తుంది. శివ సక్సెస్ అవుతున్నకొద్ది, వాళ్ళ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది.

తరువాత ఇద్దరూ ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లోకి మారుతారు. తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పమని మిత్ర అడగ్గా, ఒక చిన్న అపార్థం వల్ల ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మిత్ర తన ఫ్రెండ్ ప్రీతి ఇంటికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో శివ కుటుంబం, మిత్ర తల్లిదండ్రులు వేర్వేరు పనుల మీద చెన్నై వస్తారు. మిత్ర తండ్రి ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. శివ తన తప్పు తెలుసుకుని మిత్రను కలవడంతో ఇద్దరూ ఒకటవుతారు. కానీ అదే సమయంలో మిత్ర తల్లిదండ్రులకు దొరికిపోతారు.

Advertisement

ఒక రెస్టారెంట్‌లో ఇరు కుటుంబాలు సమావేశమవగా, శివ తల్లిదండ్రులు ఓకే చెప్పినా మిత్ర తండ్రి మాత్రం వీరి ప్రేమని నిరాకరించి ఆమెను ఊరికి తీసుకెళ్ళిపోతాడు. తండ్రి నిర్ణయంతో మిత్ర తీవ్రమైన మానసిక వేదనకు గురై హాస్పిటల్ పాలువుతుంది. పరీక్షించిన డాక్టర్లు ఆమె గురించి ఎలాంటి షాకింగ్ నిజం చెప్పారు ? ఆ కష్టకాలంలో శివ ఆమెను ఎలా చూసుకున్నాడు ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

తెలుగు మూవీనే

సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ప్రేమికుల రోజు సందర్భంగా 2026 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×