E-Paper
Advertisement

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!

Engineering Student: నా అవయవాలను దానం చేయండి అంటూ.. బీటెక్ విద్యార్ధి సూసైడ్ కలకలం!
Advertisement

Engineering Student: స్వేచ్చ బ్యూరో: నా ఆత్మహత్య అనంతరం నా అవయవాలు పనిచేస్తే అవసరమైన వారికి దానం చేయాలని, అలా కాకుండా మృతి చెందినట్లయితే నా శరీరాన్ని శాస్త్రీయ పరిశోధన మరియు ప్రయోగాలకు విరాళంగా ఇవ్వాలని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తాండ కు చెందిన మేతిపోలే శివశంకర్ (20) నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీ వీ ఆర్ ఐ టి కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

నైలాన్ తాడుతో..

అతనితోపాటు ముగ్గురు స్నేహితులు నర్సాపూర్ పట్టణంలోని సిటీ ప్యాలెస్ వద్ద రూమ్‌లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం నాడు శివకుమార్ రూమ్‌లో స్నేహితులు లేని సమయంలో నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు శివశంకర్ తన మిత్రుడికి ఇన్స్టాగ్రామ్‌లో సూసైడ్ నోట్ పంపించడం జరిగింది. అందులో చాలా కాలం నుండి చనిపోవాలని విఫలమయ్యానని పేర్కొన్నాడు. తన ఇష్టానుసారంగానే చనిపోతున్నానని, తన తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేశారని, తనకు ప్రేమ జీవితం కూడా లేదని, ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను వివరించలేనని చెప్పుకొచ్చాడు.

Advertisement

Also read: Uday Krishna Reddy: ఖాకీవనంలో కామతురాణం.. ఉదయ్‌ కృష్ణారెడ్డి భవితవ్యం ఎటువైపు?

ఉచితంగా ఇవ్వండి..

ఆత్మహత్య అనంతరం బ్రతికి ఉంటే అవయవాలు ఏవైనా పనిచేస్తుంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని, ఒకవేళ మరణిస్తే శరీరాన్ని శాస్త్రీయ పరిశోధన మరియు ప్రయోగాలకు విరాళంగా ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నాడు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి చింతిస్తున్నానని, ఒక నిర్ణయం కూడా మంచిది కాదని చెప్పుకొచ్చాడు. మృతుడు తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ వెల్లడించారు.

Advertisement

Also read: Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Related News

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

Big Stories

Advertisement
×