Best Action Movies on OTT : హాలీవుడ్ యాక్షన్ సినిమాలంటే కేవలం గన్‌ఫైట్లు, పేలుళ్లు మాత్రమే కాదు.. ఒక ఎమోషన్, ఒక విజువల్ వండర్. గత దశాబ్ద కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో దుమ్ములేపడమే కాదు, మన మైండ్ లో చెరగని ముద్ర కూడా వేశాయి. ఈ సినిమాలు కేవలం టైమ్ పాస్ కోసం కాదు, యాక్షన్ సినిమాల మేకింగ్ స్టైల్‌నే మార్చేసిన అద్భుతాలు. ఇప్పుడు ఆ టాప్-10 సినిమాల స్పెషాలిటీ ఏంటో చూద్దాం.
క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ సినిమా ఒక మైండ్ బెండింగ్ యాక్షన్ మాస్టర్‌పీస్. కలల లోపల కలలు, గ్రావిటీ లేని ఫైట్లు మనల్ని స్టన్ చేస్తాయి. Netflix, Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.
ఇందులో ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్స్ తో యాక్షన్ సీన్స్ దుమ్ము లేపుతాయి. ఒక బిల్డింగ్‌లోకి వెళ్లిన పోలీస్ టీమ్, వందలాది మంది రౌడీల మధ్య చిక్కుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. ఇందులో ఫైట్లు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. SonyLIV, Amazon Prime Videoలో దీనిని చూడచ్చు.
ఒక అపార్ట్‌మెంట్‌లో డ్రగ్ మాఫియాను అంతం చేసే పోలీస్ కథ ఇది. దీని విజువల్స్, ముఖ్యంగా ‘స్లో-మో’ యాక్షన్ సీన్స్ వేరే లెవల్ లో ఉంటాయి. Lionsgate Playలో దీనిని చూడచ్చు.
ప్రపంచమంతా మంచుతో నిండిపోతే, ఒక పరిగెత్తే ట్రైన్‌లో మిగిలిన మనుషుల మధ్య జరిగే క్లాస్ వార్ ఇది. ఈ సినిమాలో యాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. Amazon Prime Videoలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
భార్య జ్ఞాపకంగా ఉన్న కుక్కపిల్లను చంపినందుకు, ఒక రిటైర్డ్ హిట్ మ్యాన్ తిరిగి వస్తే ఎలా ఉంటుందో కీను రీవ్స్ చూపించాడు. ‘గన్-ఫు’ స్టైల్ యాక్షన్ దీనితోనే పాపులర్ అయ్యింది. Lionsgate Play, Amazon Prime Videoలో ఇది ఉంది.
ఈ సినిమా ఒక నాన్‌స్టాప్ ఛేజింగ్ సీక్వెన్స్. ఎడారిలో భారీ వాహనాలతో చేసే ఫైట్లు చూస్తుంటే సీటు అంచున కూర్చుంటాం. Jio hotstar, Amazon Prime Videoలో ఇది అద్దెకు అందుబాటులో ఉంది.
ట్రైన్‌లో జోంబీలు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. కొరియన్ యాక్షన్ డ్రామా అయినా, ఇది గ్లోబల్ రేంజ్‌లో హిట్ అయ్యింది. ఇందులో తండ్రి-కూతురు సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ అదిరిపోతాయి. Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.
వయసు మళ్ళిన లోగన్ చేసే పోరాటం మనల్ని కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా విజువల్స్ పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. Jio Hotstar లో ఇది అందుబాటులో ఉంది.
టామ్ క్రూజ్ అంటేనే రియల్ స్టంట్స్. హెలికాప్టర్ ఫైట్లు, స్కై డైవింగ్ సీక్వెన్స్ చూస్తే ఆయన ధైర్యానికి జోహార్లు చెప్పాల్సిందే. Amazon Prime Video, Netflix దీనిని చూడవచ్చు.
జాన్ విక్ సిరీస్‌లో ఇదొక మాస్ ఫీస్ట్. గుర్రాల మీద ఫైట్లు, కత్తుల యుద్ధాలు సినిమా అంతా కనిపిస్తాయి. Lionsgate Play, Amazon Prime Videoలో ఇది అందుబాటులో ఉంది.
Read Also : అప్పుల్లో కూరుకుపోయి ఆత్మతో ఆటలు… చేతబడితో వణికించే డెడ్లీ డెత్ ట్రాప్