E-Paper
Advertisement

11 సీజన్లతో దుమ్ములేపిన జాంబి సిరీస్… ఐయండిబిలో 8.1రేటింగ్… ప్రతి మలుపులోనూ ఉత్కంఠ

11 సీజన్లతో దుమ్ములేపిన జాంబి సిరీస్… ఐయండిబిలో 8.1రేటింగ్… ప్రతి మలుపులోనూ ఉత్కంఠ
Advertisement

Horror Series on OTT : ఏదో ఒక విపత్తు జరిగి ప్రపంచం మొత్తం నాశనమైపోయిన తర్వాత ఉండే పరిస్థితులను జాంబి స్టోరీలలో చూపిస్తుంటారు. అలాంటి కంటెంట్ తో పంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది ఒక జాంబి సిరీస్. ఈ సిరీస్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా రియాలిటీగా ఉంటాయి. ఇందులో జాంబీలను అత్యంత భయంకరంగా చూపించినందుకు గాను ఈ సిరీస్ పలుమార్లు ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది. కేవలం హారర్ మాత్రమే కాకుండా, మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఎమోషన్స్ ను బలంగా చూపించడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అమెరికన్ కేబుల్ టీవీలో అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన షోగా ఇది రికార్డు సృష్టించింది. ఈ సిరీస్ 11 సీజన్లతో ప్రేక్షకులకు ఒక మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది.

ఎక్కడ చూడచ్చు అంటే

అత్యంత ప్రజాదరణ పొందిన ఈ అమెరికన్ హారర్ డ్రామా టెలివిజన్ సిరీస్ పేరు ‘ది వాకింగ్ డెడ్’ (The Walking Dead). 2010లో ప్రారంభమైన ఈ సిరీస్ మొత్తం 11 సీజన్ల పాటు సాగి 2022లో ముగిసింది. ఈ సిరీస్ ప్రారంభంలో (2010లో) ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు $3.4 మిలియన్ల (సుమారు ₹28 కోట్లు) బడ్జెట్ వెచ్చించారు. ఆ తర్వాత సీజన్లలో ఇది కొంత తగ్గినా, గ్రాఫిక్స్, భారీ సెట్ల కోసం ఖర్చు చేస్తూనే వచ్చారు. 2013-14 సమయంలో ఇది అమెరికన్ కేబుల్ టీవీ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన సిరీస్ గా నిలిచింది. ఒకానొక సమయంలో దీనికి 17 మిలియన్లకు పైగా లైవ్ వ్యూస్ ఉన్నాయంటే దీని ఆదరణ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐయండిబిలో 8.1రేటింగ్ తో Netflix, Jio Hotstar ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథ ప్రధానంగా రిక్ గ్రిమ్స్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్ళిన రిక్, కొన్ని రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ప్రపంచం మొత్తం అతలాకుతలమై ఉంటుంది. మనుషులందరూ వింత వ్యాధితో చనిపోయి, జాంబీలుగా మారి అందరిపై దాడులు చేస్తుంటారు. ఆ గందరగోళ పరిస్థితిలో తన భార్యాపిల్లలు ఏమయ్యారో అని వెతుకుతూ రిక్ తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. చివరికి తన కుటుంబాన్ని, అలాగే ప్రాణాలతో మిగిలిన మరికొంతమందిని రిక్ కలుసుకుంటాడు. వీళ్ళంతా ఒక టీమ్ ఏర్పడి, ఆ జాంబీల నుండి తప్పించుకోవడానికి సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతుంటారు. అడవుల్లో, పాడుబడ్డ నగరాల్లో తలదాచుకుంటూ, సరైన ఆహారం లేకపోయినా ప్రాణాలు కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం సాగిస్తారు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి వీళ్ళు జాంబీల మధ్యలో ఎలా మనుగడ సాధించారు ? దీని ముగింపు ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : సీక్రెట్ మొబైల్ యాప్ వలలో చిన్న పిల్లలు… మెంటలెక్కించే సైకలాజికల్ మైండ్ గేమ్

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×