NTR Neel : తారక్ ..నీల్ ..ఈ కాంబోలో సినిమా మొదలవుతుంది అనగానే మురిసిపోయింది టాలీవుడ్.ముఖ్యంగా ‘కేజీఎఫ్’ సిరీస్, ‘సలార్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమాను ఊపేసిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో వెండితెరపై ఎలా చూపిస్తాడా అన్న క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చి నెట్టింటిని షేక్ చేస్తోంది.అదే సముద్ర తీరాన ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ నిలబడి ఉన్న ఒక పవర్‌ఫుల్ పోస్టర్.
నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు
అయితే ఈ పోస్టర్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అందులోని మార్చిన ట్యాగ్‌లైన్. గతంలో “You know the business and I know the chemistry” అని ఉన్న లైన్ ని మార్చి, ఇప్పుడు “You know the vision.. and I know the storm” (నీకు విజన్ తెలుసు.. నాకు తుఫాను తెలుసు) అని రాసుకొచ్చారు.ఈ ఒక్క లైనే సినిమాలోని ఇంటెన్సిటీని, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్లను స్పష్టం చేస్తోంది. దీంతోతుఫాను వచ్చే ముందు సైలెన్స్ లా ఈ సినిమా ఉండబోతుందని,సిల్వర్ స్క్రీన్ పై తారక్ విశ్వరూపాన్ని చూడబోతున్నామని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్
also read :రేయ్.. బెంగళూరు వచ్చేయ్! రజనీ వార్నింగ్‌కు మోహన్ బాబు అదిరిపోయే కౌంటర్..
నీల్ సినిమా కూడా సముద్ర నేపథ్యంలో?
ఇక ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ హిస్టరీ. ‘కేజీఎఫ్’తో రాకీ భాయ్‌ను, ‘సలార్’తో ప్రభాస్‌ను ఊహించని మాస్ యాంగిల్‌లో చూపించిన నీల్, మరి ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ తారక్ ఫ్యాన్స్‌లో పీక్స్ లో ఉంది.అయితే ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ సముద్రం బ్యాక్ డ్రాప్ లో నడిచిన సంగతి తెల్సిందే.ఇక వచ్చిన పోస్టర్ చూస్తుంటే నీల్ సినిమా కూడా సముద్ర నేపథ్యంలో సాగుతుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్
మరోవైపు, ఎన్టీఆర్ పుట్టినరోజు సందడి మే 20న స్టార్ట్ అవబోతుంది.. ఆ రోజున ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. సమాచారం ప్రకారం, సినిమా టైటిల్‌తో పాటు ఒక సాలిడ్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులో కన్నడ సెన్సేషన్ రుక్మిణి వాసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి “తుఫాను” మొదలైపోయింది, ఇక థియేటర్లలో బాక్సాఫీస్ ఏ మేరకి బద్దలవుతుందో చూడాలి !
Y̶o̶u̶ ̶k̶n̶o̶w̶ ̶t̶h̶e̶ ̶b̶u̶s̶i̶n̶e̶s̶s̶
a̶n̶d̶ ̶I̶ ̶k̶n̶o̶w̶ ̶t̶h̶e̶ ̶c̶h̶e̶m̶i̶s̶t̶r̶y̶.̶.These two are known to rewrite everything… And so did this phrase 🤫🔥
Wait for May 20th…. #NTRNeel pic.twitter.com/Vuf3XBecsn
— #NTRNeel (@NTRNeelFilm) May 14, 2026
also read :హీరోగా ఓకే.. మరి నిర్మాతగా? రెంటల్ సిస్టమ్ వివాదంలో కిరణ్ అబ్బవరం షాకింగ్ ఆన్సర్