E-Paper
Advertisement

సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన బెస్ట్ హిస్టారికల్ మూవీస్ ఇవే… వీటిలో మీరెన్ని చూసారు ?

సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన బెస్ట్ హిస్టారికల్ మూవీస్ ఇవే… వీటిలో మీరెన్ని చూసారు ?
Advertisement

Best historical movies on OTT : హిస్టారికల్ సినిమాలు మరో లోకం లోకి తెసుకెళ్తుంటాయి. వీటిని నొరెళ్ళబెట్టి మరీ చూస్తుంటారు ప్రేక్షకులు. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదువుకునే పాఠాలు మాత్రమే కాదు, కొన్నిసార్లు అవి వెండితెరపై అద్భుతాలు కూడా సృష్టించాయి. ఈ నేపథ్యంలో చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, మనల్ని ఆ కాలానికి తీసుకువెళ్లే సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి గొప్ప చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

1. ది అడ్మిరల్: రోరింగ్ కరెంట్స్ (The Admiral: Roaring Currents – 2014)

కొరియన్ సినిమా అంటే కేవలం ప్రేమకథలే కాదు, యుద్ధ తంత్రాన్ని కూడా అద్భుతంగా చూపిస్తారని ఈ సినిమా నిరూపించింది. 1597లో జరిగిన ‘మ్యోంగ్న్యాంగ్ యుద్ధం’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కేవలం 12 నౌకలతో అడ్మిరల్ ‘యి సున్-సిన్’ వందల సంఖ్యలో ఉన్న జపనీస్ నౌకలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఇందులో చూడవచ్చు. సముద్ర గర్భంలో సాగే వార్ సన్నివేశాలు ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

2. ఎలిజబెత్ (Elizabeth – 1998)

Advertisement

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాసించిన క్వీన్ ఎలిజబెత్ I జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ కపూర్ దర్శకత్వం వహించడం విశేషం. ఒక మామూలు యువతి నుంచి క్వీన్ గా ఆమె ఎలా మారింది, రాజకీయంలో ఆమె ఎదుర్కొన్న కుతంత్రాలు ఏంటి అనేది ఇందులో అద్భుతంగా చూపించారు. కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ అన్నీ ఆ కాలపు వైభవాన్ని గుర్తు చేస్తాయి. Google Play moviesలో ఇది అందుబాటులో ఉంది.

3. కింగ్‌డమ్ ఆఫ్ హెవెన్ (Kingdom of Heaven – 2005)

రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మత యుద్ధాల నేపథ్యాన్ని చూపిస్తుంది. కేవలం యుద్ధాలే కాదు, మతం పేరుతో సాగే హింసను, శాంతి కోసం ఒక సామాన్యుడు చేసే పోరాటాన్ని ఇందులో చూడవచ్చు. ముఖ్యంగా జెరూసలేం ముట్టడి సీక్వెన్స్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. జియో హాట్ స్టార్, ఆపిల్ టివిలో ఈ సినిమాను చూడవచ్చు

4. బ్రేవ్‌హార్ట్ (Braveheart – 1995)

Advertisement

“ఫ్రీడమ్!” అని అరుస్తూ విలియం వాలెస్ (మెల్ గిబ్సన్) చేసే పోరాటం ఇప్పటికీ సినీ ప్రేమికులకు గుర్తే. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడి కథ ఇది. భావోద్వేగాలు, వీరత్వం, త్యాగం… ఇలా అన్ని అంశాలు మేళవించిన ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన ఒక హిస్టారికల్ అద్భుతం. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

5. ది లాస్ట్ ఆఫ్ ది మోహికన్స్ (The Last of the Mohicans – 1992)

18వ శతాబ్దంలో అమెరికాలో బ్రిటీష్, ఫ్రెంచ్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా ఇది. అడవిలో సాగే వేట, గిరిజన తెగల పోరాటాలతో పాటు, దీనిలోని అద్భుతమైన మ్యూజిక్ మిమ్మల్ని మరో లోకానికి తీసుకువెళ్తాయి. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

6. ది లాస్ట్ ఎంపరర్ (The Last Emperor – 1987)

చైనా చివరి చక్రవర్తి ‘పు యి’ జీవితం ఎంత విచిత్రంగా సాగిందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మూడు ఏళ్ల వయసులో చక్రవర్తి కావడం నుంచి, సాధారణ పౌరుడిగా మరణించే వరకు అతని జీవితంలో జరిగిన మలుపులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి కూడా. ఈ సినిమా ఏకంగా 9 ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇది ముబి, ఆపిల్ టివి లలో అందుబాటులో ఉంది.

ఈ సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, చరిత్రపై మనకు అవగాహనను కూడా కల్పిస్తాయి. నేటి తరం యువత తప్పకుండా చూడాల్సిన చిత్రాలివి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలలో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీకెండ్ వీటిని చూసి ఆ పాత కాలపు అనుభూతిని పొందండి.

Read Also : ప్రతి ఇంటి సమస్యను గొంతెత్తి చాటిన గొప్ప ప్రయత్నం… ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×