E-Paper
Advertisement

బైకర్ మూవీ రివ్యూ: శర్వానంద్ రేసింగ్ థ్రిల్లర్ మెప్పించిందా? (Biker Movie Review & Rating)

బైకర్ మూవీ రివ్యూ: శర్వానంద్ రేసింగ్ థ్రిల్లర్ మెప్పించిందా? (Biker Movie Review & Rating)
Advertisement

 చిత్రం :  బైకర్ (Biker)

నటీనటులు : శర్వానంద్, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి

Advertisement

రచన : అభిలాష్ రెడ్డి కంకర

దర్శకత్వం :  అభిలాష్ రెడ్డి కంకర

Advertisement

మ్యూజిక్ : జిబ్రాన్ (Ghibran)

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 3, 2026

శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ తో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు ‘బైకర్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ ‘బైకర్’ అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :

కథా నేపథ్యం :- 

విక్కీ(శర్వానంద్) బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) తండ్రీ కొడుకులు. కొడుకుని మంచి బైక్ రేసర్ గా చేయాలనేది సునీల్ కోరిక. అందుకోసం అతని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. అతని గెలుపుని కూడా యాక్సెప్ట్ చేయడు. ‘నువ్వు రేసులో గెలవలేదు.. మిగిలిన వాళ్ళు ఓడిపోయారు అంతే’.. అంటూ విక్కీ సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయకుండా చేసేస్తాడు. దీంతో విక్కీలో ఇన్-సెక్యూరిటీ పెరిగిపోతుంది. ఒకానొక టైంలో ఇతను పిరికోడని భావించి… వదిలేసి వెళ్ళిపోతాడు తండ్రి సునీల్. తర్వాత విక్కీ ఏం చేశాడు? చివరికి ఈ తండ్రీ కొడుకులు కలిశారా? మధ్యలో హీరోయిన్ తో అతని లవ్ ట్రాక్ ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :-

‘లూజర్’ సిరీస్ ని తెరకెక్కించిన అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ఇది. అతని గత చిత్రం, మొదటి థియేట్రికల్ చిత్రం అయినటువంటి ‘మా నాన్న సూపర్ హీరో’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ నిర్మాతలు అతనిపై దాదాపు రూ.40 కోట్లు పెట్టేసి ‘బైకర్’ చేశారు అంటే ఇండస్ట్రీ మొత్తం షాకైంది. కానీ అతనిపై పెట్టిన ప్రతి రూపాయి తిరిగొస్తుందో లేదో తెలీదు కానీ.. బిగ్ స్క్రీన్ పై మాత్రం  ఖర్చుపెట్టిన దానికంటే ఎక్కువే పెట్టారేమో అనిపిస్తుంది. సినిమాలో విజువల్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి. సౌండింగ్ ఇంత క్వాలిటీగా ఉన్న సినిమా.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం లేజీగా స్టార్ట్ అయ్యింది. కానీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి వేగం పుంజుకుంటుంది. సెకండాఫ్ పై హోప్స్ క్రియేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్ లో చాలా వరకు సాగదీత ఉన్నప్పటికీ.. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ ఎపిసోడ్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. దాదాపు 20 నిమిషాల పైనే ఆ సీక్వెన్స్ ఉంటుంది. అలా అని ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాదు. ఇలాంటి సినిమాకి ఎంతమంది టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు అనేది అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఇక మ్యూజిక్ మాత్రం నిరాశపరిచింది.పాటలు గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రమే.

నటీనటుల విషయానికి వస్తే.. 

శర్వానంద్ ఈ సినిమా కోసం బాగా వెయిట్ లాస్ అయ్యాడు. లుక్స్ లో పర్ఫెక్షన్ ఉంది. కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఇతను ఎందుకో సీనియర్ హీరో రాజశేఖర్ ని మ్యాచ్ చేయలేకపోయాడేమో అనిపిస్తుంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో ట్రెండీగా కనిపించింది. ఇంత గ్లామర్ గా గతంలో ఈమె మరో సినిమాలో కనిపించలేదు. బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించలేదు. రాజశేఖర్ పాత్ర మాత్రం సినిమాకి ఆయువు పట్టు అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ ఇలాంటి రోల్స్ చేస్తే బెటర్. మిగతా నటీనటుల పాత్రలు పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్ :

శర్వానంద్
రాజశేఖర్
సెకండాఫ్
విజువల్స్

డైలాగ్స్

మైనస్ పాయింట్స్  

స్లో నెరేషన్
ఫస్ట్ హాఫ్

మొత్తంగా ‘బైకర్’ కథాబలం ఉన్న సినిమానే. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం, స్లో నెరేషన్ కారణంగా జస్ట్ యావరేజ్ మార్క్ వద్ద ఆగిపోతుంది.

( నాట్ ఎ విన్నర్ )

Biker Movie Review Rating  : 2.25/5.  ( నాట్ ఎ విన్నర్ )

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×