E-Paper
Advertisement

ఇవేం హార్రర్ సినిమాలురా అయ్యా… పట్టపగలే ప్యాంటు తడిపించేస్తున్నాయి

ఇవేం హార్రర్ సినిమాలురా అయ్యా… పట్టపగలే ప్యాంటు తడిపించేస్తున్నాయి
Advertisement

Best Horror Movies on OTT : కొన్ని సినిమాలు చూస్తే గుండె ఆగిపోవడమే కాదు, పక్కన ఎవరైనా ఉన్నా కూడా భయం వేస్తుంది. ఆ రేంజ్‌లో వణికిస్తున్న సినిమాలు ఓటీటీలో కొన్ని ఉన్నాయి. ఇవి పట్టపగలే ప్యాంటు తడిపించే సినిమాలు కూడా. గుండె ధైర్యం ఉంటేనే చూడండి. ఈ ఐదు సినిమాలు చూస్తే మాత్రం ఏం సినిమాలు తీశార్రా అయ్యా అని నోరెళ్ళబెడతారు కూడా. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఆ వణికించే సినిమాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

1. Sinners (2025)

మైఖేల్ బి. జోర్డాన్ నటించిన ఈ సినిమాలో భయం అంటే ఏంటో చూపిస్తారు. పాత కాలం నాటి ఊరు, అక్కడ ఉండే రక్తం తాగే వ్యాంపైర్లుతో సినిమా మరో లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమాలో రాత్రి పూట వచ్చే సీన్లు చూస్తుంటే బాడీలో వణుకు పుట్టాల్సిందే. పొరపాటున ఈ సినిమా చూస్తే, రాత్రిపూట బయట చిన్న చప్పుడు వచ్చినా గుండె ఆగినంత పని అవుతుంది. JioHotstarలో ఈ సినిమాను చూడచ్చు.

2. The Substance (2024)

Advertisement

ఇది దెయ్యం సినిమా కాదు, అంతకంటే దారుణంగా ఉంటుంది. అందంగా కనిపించాలని ఒక వింత మందు వేసుకుంటే, ఒంట్లో నుంచి ఇంకో మనిషి ఊడిపడితే ఎలా ఉంటుంది? ఆ బాడీ నుంచి వచ్చే రక్తం, మాంసం ముక్కలు చూస్తే కడుపులో తిప్పేస్తుంది. ఇందులో డెమీ మూర్ నటన చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది. వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు దీనికి కిలోమీటర్ దూరం ఉండటం బెటర్. ప్రస్తుతం MUBIలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

3. Pearl (2022)

మియా గోత్ హీరోయిన్ గా ఈ సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. అమ్మో ఆమె నటన మామూలుగా ఉండదు. స్టార్ అయిపోవాలని పిచ్చితో కన్న తండ్రిని, తల్లిని కూడా వదలకుండా నరికేస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆఖర్లో ఆ ఆమె నవ్వు చూస్తే నిద్రలో కూడా వెన్నులో వణుకు వస్తుంది. పక్కా సైకో సినిమా ఇది. JioHotstar లో ఈ సైకో సినిమా అందుబాటులో ఉంది.

4. The Night House (2021)

Advertisement

మొగుడు చచ్చిపోయాక ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళకి లేనిపోని శబ్దాలు వినిపిస్తాయి. చీకట్లో గోడల మీద కనిపించే నీడలు చూస్తే ఆపండిరా బాబోయ్ అనేస్తారు కూడా. రెబెక్కా హాల్ నటన చూస్తే మనకి కూడా భయం పుడుతుంది. jio Hotstar, Apple TVలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

5. Us (2019)

ఈ సినిమాలో మనలాగే ఉన్న ఇంకో ఫ్యామిలీ ఎర్ర బట్టలు వేసుకుని, చేతిలో కత్తెర పట్టుకుని చంపడానికి వస్తారు. జోర్డాన్ పీల్ అనే డైరెక్టర్ మైండ్ గేమ్‌తో ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తాడు. ఇందులో ఆ కవలల ముఖాలు చూస్తే చాలు, చలిజ్వరం వచ్చేస్తుంది. Amazon Prime, JioHotstarలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : రిలేషన్షిప్ మర్డర్ తో దిమ్మతిరిగే లీగల్ క్రైమ్ స్టోరీ… క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు బాస్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×