Inzamam-ul-Haq: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో దాదాపు 40 శాతం మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు, RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ( Virat Kohli) ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు అమ్ముడుపోయి విరాట్ కోహ్లీకి స్లోగా బంతులు వేస్తున్నారని ఐపీఎల్ ( IPL ) బౌలర్ల పై సంచలన ఆరోపణలు చేశాడు. బౌలర్లు నెమ్మదిగా బంతులు విసరడంతో కోహ్లీ అవలీలగా పరుగులు చేసి, RCB జట్టును గెలిపిస్తున్నాడని ఆరోపణలు చేశాడు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్లలో రబ్బర్లు…అందుకే అవలీలగా సిక్సులు, బౌండరీలు కొడుతున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మొన్న వైరల్ ఫీవర్ తో పాటు చీలమండ గాయం అయిన కూడా, ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాడి ముందుకు సాగుతున్నాడు. దాదాపు 38 సంవత్సరాలు నిండిన విరాట్ కోహ్లీ.. కుర్ర క్రికెటర్లకు పోటీని ఇస్తున్నాడు. ఈ సారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అలాంటి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ (Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే నెమ్మదిగా బౌలర్లు బంతులు వేస్తున్నారని ఆరోపణలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన యాజమాన్యం డబ్బులు ఇచ్చి మరి విరాట్ కోహ్లీకి నెమ్మదిగా బౌలింగ్ చేయమని కుట్ర చేస్తోందని బాంబు పేల్చాడు.
బెంగళూరుతో ఆడే ప్రత్యర్థి బౌలర్లు అందరూ ఆ డబ్బులు తీసుకొని.. విరాట్ కోహ్లీకి నెమ్మదిగా బంతులు సంధిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశాడు. అందుకే గాయమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ సులభంగా పరుగులు చేయగలుగుతున్నాడని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్, దొంగాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ముందు ఐపీఎల్ దేనికి కూడా పనికి రాదని కుండ బద్దలు కొట్టి చెప్పాడు ఇంజమామ్-ఉల్-హక్. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. అయితే దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది చేతకాని దద్దమ్మలు ఇలాగే విరాట్ కోహ్లీపై బురద జల్లుతారని కౌంటర్లు పేల్చున్నారు ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ సాధించే రికార్డులు పాకిస్తాన్ లో ఎవరు కూడా సాధించే మొనగాడు లేడని..అందుకే నిత్యం మనపై ఏడుస్తారని కౌంటర్లు పేల్చుతున్నారు.