E-Paper
Advertisement

SRHపై డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ పోస్ట్..ఇలా జ‌రుగ‌క‌పోతే కావ్యకు క‌న్నీళ్లు త‌ప్ప‌వు !

SRHపై డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ పోస్ట్..ఇలా జ‌రుగ‌క‌పోతే కావ్యకు క‌న్నీళ్లు త‌ప్ప‌వు !
Advertisement

David Warner -SRH:    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) టీమ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. నాలుగో స్థానం కోసం మిగతా నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సన్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకోవడంపై డేవిడ్ వార్నర్ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఓపెనర్లతో పాటు, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌ బౌలింగ్ లో కూడా అద‌ర‌గొట్టాలని వెల్లడించారు. అప్పుడే ఫైనల్స్‌ దాకా వెళ్లి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెల్చుకుంటుందని కీలక సూచనలు చేశారు డేవిడ్ వార్నర్. లేకపోతే హైదరాబాద్ ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాపకు ( Kavya Maran) కన్నీళ్లు మిగలడం ఖాయం అంటూ హెచ్చరించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై డేవిడ్ వార్నర్ ( David Warner) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

SRHపై డేవిడ్ వార్న‌ర్ షాకింగ్ పోస్ట్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో బౌలింగ్ లో తేలిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆ తర్వాత మెరుగుపడింది. ఈ క్రమంలోనే వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరింది హైదరాబాద్. ఇలాంటి క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ షాకింగ్ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్ ఛాంపియన్ కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ కచ్చితంగా రాణించాలన్నారు. ఇద్దరు కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పితే సన్ రైజర్స్ హైదరాబాద్ ను తట్టుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. అటు ఇషాన్ కిషన్, క్లాసెన్ చివరలో మెరుపులు మెరుపు ఇస్తే.. సూపర్ విక్టరీ అందుకోవడం ఖాయమన్నారు.

బ్యాటింగ్ సరే… బౌలింగ్ లో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు అతడు తీస్తాడని అంచనా కూడా వేశారు. ఒకవేళ ఇలా జరగకపోతే కావ్య పాపకు కన్నీళ్లు మిగలడం గ్యారంటీ అని హెచ్చరించారు. దీంతో డేవిడ్ వార్నర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కాగా ఇప్పటికే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016 ఐపీఎల్ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఛాంపియన్ అయింది. ఆ సమయంలో ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు డేవిడ్ వార్నర్. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టును ఫైనల్స్ లో చిత్తుచేసిన హైదరాబాద్.. తొలిసారిగా ఛాంపియన్ అయింది.

Advertisement

 

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×