E-Paper
Advertisement

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

2026 Thriller Movies : 2026 సంవత్సరం థ్రిల్లర్ ప్రేమికులకు నిజంగా మంచి బహుమతి ఇచ్చిన సంవత్సరం. సస్పెన్స్, యాక్షన్, మిస్టరీ, సర్వైవల్… అన్ని రకాల థ్రిల్లర్‌ లు ఈ ఏడాది ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టాయి. ఇందులో కొన్ని టాప్ థ్రిల్లర్ చిత్రాల గురించి వివరంగా చెప్పాలంటే…

The Rip
మ్యాట్ డామన్ – బెన్ అఫ్లెక్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మయామిలోని హై-ప్రొఫైల్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ ఒక ఆపరేషన్‌ లో కార్టెల్ దాచిన లక్షలాది డాలర్ల నిధిని కనుగొంటుంది. ఆ నిధి బృందంలోని సభ్యుల మధ్య దురాశ, అనుమానాలు, విశ్వాస ద్రోహాలను రెచ్చగొడుతుంది. యాక్షన్, ట్విస్టులు, మనస్తత్వ గేమ్‌ లతో నిండిన ఈ చిత్రం చివరి వరకు మిమ్మల్ని కట్టిపడేస్తుంది. Netflixలో అందుబాటులో ఉంది.

Crime 101
దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన హై-ప్రొఫైల్ ఆభరణాల దొంగతనాల సిరీస్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్. డిటెక్టివ్ లూ లూబెస్నిక్ ఈ దొంగతనాల వెనుక ఒక ప్రొఫెషనల్ దొంగ మైక్ డేవిస్ ఉన్నాడని అనుమానిస్తాడు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతుండగా అతని సొంత సహోద్యోగులే వ్యతిరేకంగా మారడం, పెద్ద దోపిడీ పథకం బయట పడటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. ఊహించని ట్విస్టులు, స్మార్ట్ డైలాగ్స్‌ తో ఉన్న ఈ చిత్రం Prime Videoలో స్ట్రీమ్ అవుతోంది.

Apex
2026లో జరిగే సర్వైవల్ థ్రిల్లర్. సాషా అనే రాక్ క్లైంబర్ తన వ్యక్తిగత బాధలను మరచిపోవడానికి ఆస్ట్రేలియన్ అరణ్యంలోకి ఒంటరిగా వెళ్తుంది. కానీ అక్కడ ఆమెను ఒక ప్రమాదకరమైన, నైపుణ్యం కలిగిన వేటగాడు వెంబడిస్తాడు. శారీరక బలం, మేధస్సు, సర్వైవల్ స్కిల్స్ మధ్య జరిగే ఈ పోరాటం చాలా టెన్షన్‌ తో నిండి ఉంటుంది. నెట్ ఫ్లిక్ లో అందుబాటులో ఉంది.

Tu Yaa Main
ఈ సంవత్సరం థియేటర్లలో విడుదలై భారీ సంచలనం సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘తూ యా మై’. ఒక వర్ధమాన మరాఠీ ర్యాపర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్ని రొమాంటిక్ ట్రిప్‌ కి వెళ్తారు. కానీ వారి ప్రయాణం భయంకరంగా మారి, ఒక ప్రమాదకరమైన మొసలి ఉన్న స్విమ్మింగ్ పూల్‌ లో చిక్కుకుపోతారు. జీవన్మరణ సమరం, తీవ్రమైన ఉద్రిక్తతతో నిండిన ఈ చిత్రం చివరి వరకు మిమ్మల్ని కట్టి పడేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

Tom Clancy’s Jack Ryan: Ghost Wars
జాన్ క్రాసిన్‌స్కీ మళ్లీ జాక్ ర్యాన్‌గా వచ్చిన ఈ పొలిటికల్-స్పై థ్రిల్లర్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఒక రహస్య ఆపరేషన్ సమయంలో ప్రపంచాన్ని బెదిరించే పెద్ద కుట్రను జాక్ ర్యాన్ బయట పెడతాడు. MI6 ఏజెంట్‌తో కలిసి అతను చేపట్టే మిషన్ ప్రపంచ రాజకీయాలు, గూఢచారి ఆటలు, హై-స్టేక్స్ యాక్షన్‌తో నిండి ఉంటుంది. ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Read Also : రెండేళ్ల కొడుకు ముందే తల్లి దారుణ హత్య… ఈ మినీ సిరీస్ ను డోంట్ మిస్

Related News

బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

శవం పక్కనే బుక్… పోలీసులకు హింట్ ఇస్తూ వరుస హత్యలు చేసే మెంటల్ సైకో

Big Stories

×