E-Paper
Advertisement

5 సిక్సులు, 4 బౌండ‌రీలు..3 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన అర్జున్ టెండూల్క‌ర్

5 సిక్సులు, 4 బౌండ‌రీలు..3 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన అర్జున్ టెండూల్క‌ర్

Arjun Tendulkar :   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) వాటర్ బాయ్ గా దయనీయ పరిస్థితిలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar ), తాజాగా బీభత్సం సృష్టించాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో అదరగొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరు మారుమోగుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో… నిరూపించుకోలేకపోయినా అర్జున్ అండూల్కర్.. ముంబై టీ20 లీగ్ లో ( T20 Mumbai 2026 ) మాత్రం రెచ్చిపోయాడాడు. ఈ క్రమంలోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ అయ్యాడు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

5 సిక్సులు, 4 బౌండ‌రీలు..3 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన అర్జున్ టెండూల్క‌ర్

ముంబై టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ ( T20 Mumbai 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొన్న జూన్ ఒకటో తేదీన ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ జూన్ 13వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా అంధేరి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అర్జున్ టెండూల్కర్. ఈ క్రమంలోనే బాంద్రా బ్లాస్టర్స్ వర్సెస్ ARCS అందేరి (ARCS Andheri vs Bandra Blasters, 16th Match) జట్ల మధ్య సోమవారం రాత్రి మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) జరిగిన ఈ మ్యాచ్ లో అందేరి జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్… ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా విధ్వంసం సృష్టించాడు.

బౌలింగ్ లో మూడు ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్… 11 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం 145 పరుగులను చేదించే క్రమంలో అర్జున్ టెండూల్కర్.. అనుభవజ్ఞమైన ఆల్ రౌండర్ జాక్వేస్ కెల్లిస్ జాక్ కాలిస్ ( Jacques Kallis ) తరహాలో దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో 34 బంతులు ఎదుర్కొన్న అర్జున్ టెండూల్కర్.. ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 66 పరుగులు చేసి అంధేరి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో అదరగొట్టినందుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ కు 50వేల ప్రైజ్ మనీ కూడా వచ్చింది. దీంతో అర్జున్ టెండూల్కర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ముంబై టీ20 లీగ్ సందర్భంగా అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్… పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిస్తోంది. అడు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా అతన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు అంధేరి జట్టు సభ్యులు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

నైట్ క్ల‌బ్ లో గొడ‌వ‌..వీధి రౌడీల్లాగా త‌న్నుకున్న‌ బెన్ స్టోక్స్‌, అట్కిన్సన్

పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

టెస్టుల్లో ఉండే ఫాలో-ఆన్ అంటే ఏంటి ? ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా ?

Tanveer Ahmed: షేక్ హ్యాండ్ కాదు, డ‌బ్బుల కోసం జై షా ఎదైనా చేస్తాడు

రిజ్వాన్ కు ఒళ్లంతా బ‌లుపే…బంగ్లా ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదు

IND VS AFG: గిల్ కు ఘోర అవ‌మానం..కెప్టెన్ నేనే అంటూ రిష‌బ్ పంత్ బిల్డ‌ప్

Shahid Afridi: పాక్ బౌలర్ల దెబ్బకు..వైభవ్ ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే

Big Stories

×