BigTV English
Advertisement

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : విజ‌య్ అంటోని తెలుగు, తమిళం ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘బిచ్చగాడు’ సినిమాతో అందరి చూపు ఈ హీరో మీదే పడింది. ఆతరువాత కూడా వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ కి దగ్గరవుతున్నాడు. ఇప్పటి వరకు పాతిక సినిమాలు చేసి, తన సత్తా చాటుతున్నాడు. 25 వ సినిమాగా గ‌త నెల సెప్టెంబ‌ర్ 19న వచ్చిన ‘భ‌ద్ర‌కాళి’ సినిమా తెలుగు, తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అడుగుపెట్టేసింది. ఈ సినిమా వివరాలను తెలుసుకుందాం పదండి.


జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘భద్రకాళీ’ (Bhadrakaali) సినిమాకి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణ, సెల్ మురుగన్, ట్రుప్తి రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 సెప్టెంబర్ 19 న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అక్టోబర్ 24 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.7/10 రేటింగ్ కూడా ఉంది.

కథలోకి వెళ్తే

కిట్టు (విజయ్ ఆంటోనీ) ఒక మీడియేటర్ గా ఎలాంటి పనులనైనా తెలివిగా హ్యాండిల్ చేస్తుంటాడు. సెక్రటేరియట్‌ ని తన అడ్డాగా మార్చుకుని అందరితో పరిచయాలను పెంచుకుంటాడు. అతని పవర్ వల్ల అధికారులు, పొలిటీకల్ లీడర్స్ కూడా అతన్ని రిస్పెక్ట్ ఇస్తారు. అతని డీల్స్ వల్ల కిట్టు ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. కిట్టు ఒక గ్యాంగ్‌ తో కలసి ఒక భారీ డీల్ లో ఎంట్రీ ఇస్తాడు. ఇది దాదాపు వందల కోట్ల స్కామ్. కిట్టు మొదట దీనిని రిజెక్ట్ చేస్తాడు, కానీ డబ్బు కోసం మళ్ళీ జాయిన్ అవుతాడు. ప్రభుత్వ భూములను కాజేసే దిశగా, ఈ మోసం ఉంటుంది.


Read Also : హెర్బల్ మెడిసిన్‌తో పుట్టే అంతులేని వింత వ్యాధి… వెన్నులో వణుకు పుట్టించే సరికొత్త జొంబీ హర్రర్ మూవీ

కానీ ఈ ప్లాన్‌లో అభ్యంకర్ శంకర్ అనే పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అవుతాడు. అతను ఇండియాకి ప్రెసిడెంట్ రేస్ లో ఉంటాడు. కిట్టు, అభ్యంకర్‌తో కలిసి ఈ భారీ స్కామ్ కి ప్లాన్ చేస్తాడు. కానీ అభ్యంకర్ కిట్టును వాడుకుని, ఆ స్కామ్‌ను తన కోసం యూజ్ చేసుకుంటాడు. ఆ తరువాత కిట్టును బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతని ఆస్తులను సీజ్ చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇక క్లైమాక్స్ ఊహించని విధంగా మైండ్ ని బెండ్ చేస్తుంది. కిట్టుకి ఈ స్కామ్ వల్ల ఎలాంటి సమస్యల్లో పడతాడు ? అభ్యంకర్‌, కిట్టుని ఎలా మోసం చేస్తాడు ? దీని నుంచి కిట్టు ఎలా బయట పడతాడు ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పొలంలో శవాల పంట… తలలేని మొండాలతో ఊరు ఊరంతా వల్లకాడు… అల్టిమేట్ యాక్షన్ తో అదరగొట్టే మూవీ

OTT Movie : భూమిని తుడిచి పెట్టే మిస్టీరియస్ జంతువులు… హ్యుమానిటీ ఫైనల్ ఫైట్… ఒక్కో సీనుకూ గూస్ బంప్స్ పక్కా

OTT Movie : ఏం సినిమా గురూ… బెడ్ రూమ్‌లో అలాంటి సీన్స్… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా

Idli Kottu OTT: ‘ఇడ్లీ కొట్టు’ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రిమింగ్‌, ఎక్కడంటే!

Lokah OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘ లోక’ … స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

×