OTT Movie : ఇండోనేషియన్ జానపద కథలు, జావనీస్ హెర్బల్ మెడిసిన్ ఆధారంగా తెరకెక్కిన, ఒక జాంబీ హారర్ మూవీ ఆడియన్స్ బాగానే భయపెడుతోంది. ఒక వ్యక్తి శాశ్వత యవ్వనం కోసం ఒక మందు తాగి జాంబీ అవుతాడు. ఆ తరువాత కథ భయంకరమైన ట్విస్టులు, హారర్ ఎలిమెంట్స్ తో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది ఎలిక్సిర్’ (The Elixir) (ఇండోనేషియన్ పేరు: అబాది నాన్ జాయా) 2025లో వచ్చిన ఈ ఇండోనేషియన్ జాంబీ హారర్ మూవీకి కిమో స్టాంబోల్ దర్శకత్వం వహించారు. ఇందులో డాన్ని దామారా, మిక్హా తంబయోంగ్, ఎవా సెలియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 గంట 56 నిమిషాలతో ఐయండిబి లో 7.0/10 రేటింగ్ ను పొందింది. ఇది 2025 అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
జావా ద్వీపంలోని ఒక చిన్న గ్రామంలో సాదిమిన్ అనే వ్యక్తి, తన కుటుంబంతో కలసి జీవిస్తుంటాడు. ఇతను ఒక ప్రసిద్ధ హెర్బల్ మెడిసిన్ బిజినెస్ నడుపుతుంటాడు. సాదిమిన్ శాశ్వత యవ్వనం కోసం ఒక ఔషధం తయారు చేయాలని అనుకుంటాడు. అతని కుమార్తెలు సుక్ష్మా, ఎవా కలిసి అతని ప్రయోగాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ సాదిమిన్ ఆ మందును తయ్యారు చేసి తాగేస్తాడు. ఆ తర్వాత అతను వాస్తవానికి జాంబీ అవుతాడు. భయంకరమైన హాంటెడ్ మొన్స్టర్ గా, ఆకలితో మనుషులను తినడం మొదలెడతాడు. గ్రామంలో జాంబీ అవుట్‌బ్రేక్ మొదలవుతుంది. సుక్ష్మా, ఎవా కలిసి అతన్ని ఆపడానికి పోరాడతారు.
Read Also : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్… ఇంకా చూడలేదా ?
సాదిమిన్ జాంబీ అయిన తర్వాత, ఆ గ్రామం భయంకరంగా మారుతుంది. అతని వల్ల మరిన్ని జాంబీలు వ్యాప్తి అవుతాయి. సుక్ష్మా, ఎవా తండ్రి సాదిమిన్‌ను కాపాడుకోవడానికి, జాంబీలతో ఫైట్ చేస్తారు. ఆ గ్రామంలో భయంకర ఫైట్ జరుగుతుంది. జాంబీలు పూర్తిగా వ్యాపిస్తాయి. ఇక క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. చివరికి సుక్ష్మా, ఎవా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారు? దీనికి విరుగుడు కనిపెడతారా ? తమ తండ్రిని కాపాడుకుంటారా ? వీళ్ళు కూడా జాంబిలుగా మారుతారా ? అనే విషయాలను, ఈ ఇండోనేషియన్ జాంబీ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.