Shiva Re release: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా నటించిన చిత్రం శివ(Shiva). 1989 అక్టోబర్ 5వ తేదీ విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా క్లాసికల్ సినిమా అని చెప్పాలి. అప్పట్లోనే ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. నాగార్జున కెరియర్ లోనే కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయిన శివ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని నవంబర్ 14 వ తేదీ 4k వర్షన్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఈ సినిమా 4k వర్షన్ డాల్బీ అట్మాస్ ద్వారా విడుదలవుతూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఇలా ఈ సినిమా తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే రేపు (శనివారం) ఉదయం 11:07 నిమిషాలకు అల్లు అర్జున్ ప్రత్యేకంగా శివ సినిమా గురించి మాట్లాడబోతున్నారు. శివ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి మార్పులను తీసుకువచ్చింది అనే అంశాల గురించి అల్లు అర్జున్ మాట్లాడబోతున్నారని స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఇలా శివ రీ రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారనే విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు . ఈ సినిమా గురించి అల్లు అర్జున్ ఏం మాట్లాడతారనే విషయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ అట్లి సినిమా గురించి కూడా ఏదైనా అప్డేట్ ఇస్తారేమోనని సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి బన్నీ ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారనేది తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా విషయానికి వస్తే నాగార్జునకు జోడిగా అమల హీరోయిన్ గా నటించారు. కాలేజీ బ్యాగ్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
ICON STAR of Indian Cinema 🔥🔥🔥
×
ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5
— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025
శివ సినిమా నాగార్జున కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రాంగోపాల్ వర్మ ఇదే సినిమాని హిందీలో కూడా రీమేక్ చేసారు. అక్కడ కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప2 సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Lokesh Kanagaraj: లోకేశ్ కథను రిజెక్ట్ చేసిన తలైవా.. ఎల్సీయూలోకి అడుగు పెట్టిన డైరెక్టర్!