E-Paper
Advertisement

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా తెలుగు సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే

లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా తెలుగు సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే
Advertisement

Bharathiraja films : భారతీరాజా..! కల్ట్‌ క్లాసిక్‌ మూవీస్‌కి కేరాఫ్‌.. ఆయన తెలుగులో డైరెక్ట్ చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆయన చూపించిన మార్క్‌ మాత్రం నెవర్‌ బిఫోర్‌.. నెవర్‌ అగైన్‌గా చెప్పవచ్చు. ఇంతకీ ఆయన తీసిన టాప్‌-5 తెలుగు సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం!

‘సీతాకోకచిలుక’ (1981):

ప్రేమ, కుల వ్యవస్థ, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. దర్శకుడు భారతీరాజా ఈ చిత్రాన్ని తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అలైగల్ ఒవితల్లై’ చిత్రానికి రీమేక్ చేశారు. ఇళయరాజా అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. కార్తీక్ అరుణ నటించిన ఈ మూవీ 1981లో రిలీజ్ అయ్యింది. ఇది SUN NXTలో స్ట్రీమ్‌ అవుతుంది.

కొత్త జీవితాలు (1981):

Advertisement

ఇది ఒక అందమైన రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా ద్వారా సుహాసిని తెలుగు తెరకు పరిచయమయ్యారు. సుహాసినితో పాటు హరిప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. కథలో భాగంగా ఒక పల్లెటూరికి వచ్చిన నిజాయితీ గల స్కూల్ టీచర్, ఒక సాధారణ వ్యక్తిని ప్రేమిస్తుంది. వారి ప్రేమను ఒక అహంకారి అయిన భూస్వామి ఎలా నాశనం చేయాలని ప్రయత్నించాడనేదే ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇళయరాజా అందించిన సంగీతం, పాటలు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. గ్రామీణ వాతావరణాన్ని, మనుషుల భావోద్వేగాలను భారతీరాజా తనదైన శైలిలో తెరకెక్కించిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. ఇది మూవీ యూట్యూబ్‌లో స్ట్రీమ్‌ అవుతుంది.

ఆరాధన(1987):

1987లో చిరంజీవి, సుహాసిని, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆరాధన’. ఈ సినిమాలో చిరంజీవి ‘పులిరాజు’ అనే ఒక అమాయకమైన, అల్లరి చిల్లరగా తిరిగే పల్లెటూరి యువకుడిగా ఎంతో అద్భుతంగా నటించారు. టేలిగ్రాఫ్ ఆపరేటర్ పాత్రలో సుహాసిని తన కెరీర్‌లో మరుపురాని నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

ఖైదీ వేట (1985):

Advertisement

ఒక యాక్షన్ థ్రిల్లర్. కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం ఒరు కైదియిన్ డైరీకి తెలుగు డబ్బింగ్ రూపం. ఈ మూవీలో కమల్ హాసన్ డ్యూయల్‌ రోల్‌లో మెప్పించారు. ముగ్గురు అవినీతిపరుల కుట్ర వల్ల జైలు పాలై, భార్యను కోల్పోయిన ఒక కమల్‌ హాసన్.. పగతో జైలు నుంచి తప్పించుకుని చనిపోయినట్లు నటిస్తాడు. ఆ తర్వాత తన జీవితాన్ని నాశనం చేసిన శత్రువులను ఒక డైరీ సహాయంతో ఒక్కొక్కరిగా వేటాడి చంపడం ప్రారంభిస్తాడు. అయితే చట్టాన్ని నమ్మే అతని సొంత కొడుకే పోలీస్ అధికారిగా మారి, ఆ హంతకుడు తన తండ్రే అని తెలియకుండా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది.

జమదగ్ని (1988):

సూపర్ స్టార్ కృష్ణ, రాధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీ కంప్లిట్‌గా రాజకీయ నేపథ్యంతో సాగే చిత్రం. అవినీతిపరుడైన ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా పోరాడే ఒక నిజాయితీ ఉన్న జర్నలిస్ట్ కథే ఈ సినిమా. సమాజంలో అన్యాయాలను, ప్రజాధనాన్ని దోచుకుంటున్న దుర్మార్గుడైన ఒక రాజకీయ నాయకుడిని ఎండగట్టాలని ఒక ధైర్యవంతుడైన జర్నలిస్టుగా కృష్ణ ఈ మూవీలో అదరగొడతారు. ఈ చిత్రం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

Read Also : ప్రైవేట్ వీడియోలను అమ్ముకునే అమ్మాయిలు… మెంటలెక్కించే స్పై థ్రిల్లర్

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×