బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Advertisement

బంగారం-వెండి ధరల పతనం.. కొనుగోలు ఇదే సరైన సమయం, లోహాల ధరలు పతనం వెనుక?

బంగారం-వెండి ధరల పతనం.. కొనుగోలు ఇదే సరైన సమయం, లోహాల ధరలు పతనం వెనుక?

Gold-Silver Price Down: అంతర్జాతీయ పరిణామాలు బంగారం-వెండి మార్కెట్లపై పడ్డాయి. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు అమాంతంగా పతనం అవుతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు 11 వారాల కనిష్ఠ స్థాయికి చేరినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లిళ్లకు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు వ్యాపారులు.

అంతర్జాతీయ పరిణామాలు.. బంగారం-వెండి ధరల పతనం

అంతర్జాతీయ పరిణామాలు బంగారం-వెండిని తాకింది. దీని కారణంగా మార్కెట్లో ఆయా లోహాల ధరలు పతనం అవుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌ బలోపేతం కావడం, ద్రవ్యోల్బణంలో ఉద్యోగ నియామకాలు అంచనాలకు మించడం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గవనే భావనల నెలకున్నాయి.

ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారు వినియోగదారు భారత్. తగ్గుదల రిటైల్ డిమాండ్‌ను పునరుద్ధరించగలదని, ధరలు అదుపులో ఉంటే రాబోయే వారాల్లో దిగుమతులను పెంచే అవకాశం ఉందని డీలర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పెట్టుబడుదారులు అమ్మకాలకు పాల్పడడంతో ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 11 వారాల కనిష్ఠ స్థాయికి చేరాయి.

లోహాల ధరలు పతనం వెనుక.. బ్లాక్ మార్కెట్ పెరుగుతోందని అంచనాలు

ఈ విషయాన్ని బులియన్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్చిలో ఔన్సు బంగారం ధర 5400 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 1400 డాలర్లు తగ్గి 4206 వద్దకు చేరింది. మార్చి 23 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిని తాకింది.  ఫిబ్రవరి చివరిలో ఇరాన్ యుద్ధం మొదలుకావడానికి ముందు బంగారం ధరలు దాదాపు 20 శాతం పడిపోయాయి.

అమెరికా-ఇరాన్‌ల మధ్య తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పతనం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. ఇటీవలికాలంలో భౌగోళిక రాజకీయాల కంటే ద్రవ్య విధానపరమైన ఆందోళనలు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాలర్‌ బలోపేతమైతే ఇతర కరెన్సీలు వినియోగించేవారు బంగారం కొనడం కష్టమవుతుంది. ముడిచమురు ధర పెరిగినప్పుడు పసిడి ధరలు తగ్గుతుంటాయి.

ALSO READ: బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో బుధవారం రాత్రి 12 గంటలకు బంగారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధరల రూ.1,50,400కు చేరింది. ఢిల్లీ, చెన్నై, ముంబై మార్కెట్లో నాలుగైదు వందలు అటు ఇటుగా ఉంది. మరోవైపు వెండి ధర రూ.2,42,000కు దిగి వచ్చింది. కిలోకు దాదాపు 9 వేల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

దేశీయ ట్రేడింగ్‌లో జూలై-2026 డెలివరీకి సంబంధించిన MCX వెండి కాంట్రాక్టులు కిలోకు రూ. 4,528 తగ్గి రూ. 2,34,000 వద్దకు చేరాయి. ఆగస్టు 2026 డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 2 శాతం తగ్గి రూ. 2,555 పడిపోయింది. అధిక పన్నుల నేపథ్యంలో బంగారం, వెండి బ్లాక్ మార్కెట్ పెరుగుతోందని, గ్రేమార్కెట్‌ పెరిగినట్లు ఆభరణాల విక్రయదారులు చెబుతున్నారు. కేవలం బంగారం, వెండి కాకుండా ఇతర విలువైన లోహాలు ఒత్తిడిలో ఉన్నాయి.

Related News

బంగారంపై మరిన్ని ఆంక్షలు? బ్యాంకులకు ఆర్థికశాఖ లేఖ, ఏం జరుగుతోంది?

మార్కెట్లో బంగారం ధరలు పతనం.. అదే దారిలో స్టాక్ మార్కెట్‌ పతనం

RBI: ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం.. ఆర్బీఐ కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో

విప్రో వార్నింగ్.. వేధింపులు ఏ మాత్రం సహించం, పూణె విషయంలో

Rajesh Exports Scam: దేశంలో మరో మెహతా స్కామ్.. ఏకంగా 15 లక్షల కోట్లు, ఆపై సెబీ నిషేధం

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఇకపై ఆ కోడ్ లేకపోతే సిలిండర్ రానట్లే!

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

×