E-Paper
Advertisement

బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

బార్‌లో మద్యం తాగుతూ భార్యలు చేసే రచ్చ… ఏ ఓటీటీలో ఉందంటే ?

bibi payra : ఈ మధ్యకాలం సినిమాల్లో మహిళా కథానాయికలు, వారి ధైర్యం, తిరుగుబాటు కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక విలక్షణమైన చిత్రం ‘బిబి పాయ్‌రా’ (Bibi Payra). బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ జానర్‌ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సినిమా కథ ఇద్దరు పెళ్ళయిన మహిళల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ భర్తల నిర్లక్ష్యం, కుటుంబ ఒత్తిడి, సమాజపు బంధాల మధ్య చిక్కుకుపోయి నిరాశతో రోజులు గడుపుతారు. కానీ ఒక రోజు వారు జీవితాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయం వారి లైఫ్ లో ఊహించని మలుపుల్లోకి తీసుకెళ్తుంది. తమ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం వారు చేపట్టిన ప్లాన్ కాస్తా తప్పుడు దిశలో వెళ్తుంది. దీంతో గందరగోళం, పొరపాట్లు, అనుకోని ప్రమాదాలు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ ప్రయాణంలో వారికి కొంతమంది అనుకోని వ్యక్తుల సహాయం కూడా లభిస్తుంది. మరి వాళ్ళు ఏకంగా బార్లో కూర్చుని మందు తాగే అంత ఇండిపెండెంట్ గా మారడానికి వెనకున్న కారణం ఏంటి ? తరువాత ఆ మహిళల జీవితం ఎటు వెళ్ళింది ? చివరకి క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

డార్క్ కామెడీ స్టైల్

సినిమా పూర్తిగా డార్క్ కామెడీ శైలిలో సాగుతుంది. మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వారి ఆంతర్యం, సమాజం వారిపై వేసే ఒత్తిడి… ఇవన్నీ నవ్వు కలిగించేలా, అదే సమయంలో ఆలోచింపజేసేలా చూపించారు. హాస్యం ద్వారా సమాజంలోని వైరుధ్యాలను, మహిళల స్థితిని ధైర్యంగా ఎండగట్టారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో స్వాస్తిక ముఖర్జీ, పావలి దామ్ అద్భుతంగా నటించారు. వారి నటన సినిమాకు బలం చేకూర్చింది. వీరితో పాటు రూపాలీ రాయ్ భట్టాచార్య, భబాని బోస్ ముఖర్జీ, అనిర్బన్ చక్రవర్తి వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. థియేటర్ నుంచి OTT వరకు ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలై మంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. IMDbలో 6.6 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు జూన్ 5 నుంచి Hoichoi OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో బెంగాలీలో మాత్రమే అందుబాటులో ఉంది. మహిళా సాధికారత, డార్క్ హ్యూమర్, సస్పెన్స్ కలిపి ఉన్న ఈ సినిమా థియేటర్‌లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు హోయ్ చోయ్ లో చూడొచ్చు. డార్క్ కామెడీ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వాళ్ళు, ముఖ్యంగా బెంగాలీ థ్రిల్లర్లను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ సినిమాను డోంట్ మిస్.

Read Also : రెండేళ్ల కొడుకు ముందే తల్లి దారుణ హత్య… ఈ మినీ సిరీస్ ను డోంట్ మిస్

Tags

Related News

డివోర్స్ మహిళతో రెండో పెళ్లి… మరో మహిళతో సన్నిహితంగా… ఇదేం ఫ్యామిలీ భయ్యా

‘ఏపెక్స్’ నుండి ‘ది రిప్’ వరకు… 2026లో విడుదలైన 5 కొత్త సస్పెన్స్ థ్రిల్లర్స్

ఫేక్ నోట్ల యాపారం… ప్రింటింగ్ ప్రెస్ పేరుతో వీళ్ళు చేసే పని చూస్తే బుర్రపాడు

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

Bharat Bhhagya Viddhaata OTT : 26/11 దాడి అన్ టోల్డ్ స్టోరీ… కంగనా మూవీ స్ట్రీమింగ్ డేట్

Avatar 3 OTT Release : 12,000 కోట్ల విజువల్ వండర్ ఓటీటీలోకి… రెడీ అవ్వండమ్మా

This Week OTT Movies : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ మూడు మస్ట్ వాచ్..!

Big Stories

×